నాగబాబు గారాల కూతురు నిహారిక కొణిదెల మరికొన్ని నిమిషాలలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న విషయం మనకి విదితమే. నిహారిక పెళ్లికి ప్రామిస్ చేసిన విధంగా పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకిరానందన్‌తో కలిసి నిన్న సాయంత్రం బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ చేరుకున్నారు.
అంతేకాకుండా వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తన అన్న కూతురు పెళ్లి పనులను దగ్గర ఉంది చూసుకుంటున్నారు. నిహారిక పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకతో మరింత సందడి వచ్చిందని మెగా ఫాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక అకిరానందన్ ను చూస్తుంటే.. అచ్చు పవన్ కళ్యాణ్‌ను చూసినట్టే ఉంది అంటున్నారు మెగా అభిమానులు. ఇక మెగా ప్రిన్సెస్ నిహారిక మరియు చైతన్య జొన్నలగడ్డ ల వివాహం మరికొన్ని నిమిషాలలో జరగనున్నది.
నిహారిక మరియు చైతన్య జొన్నలగడ్డ ల వివాహం సుముహూర్తం ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు. ఈ వివాహం ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో జరుగుతుంది. ఈ వేడుక మెగా ఫాన్స్ ఎప్పటికి మర్చిపోలేనిది గా మిగిలిపోనున్నది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసనతో దంపతులు మరియు అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు ఫామిలీ సందడి చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ పెళ్లికూతురిగా ముస్తాబయింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.