NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎవరి భూమి ఎవరి సర్వే!! నీకేమైంది జగన్??

 

 

**రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అనేది సామెత ఐతే… మన రాజు గారు మాత్రం రాజు తలుచుకుంటే చట్టాలు చుట్టాలు అయ్యేలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా చేపట్టాబోతున్న భూ సర్వే అసలు ఏ చట్టం లో ఉంది దాని విధివిధానాలు ఏంటి అనేది ఆలోచించకుండానే ఆయన దీని మొదలు పెట్టినట్టు అర్థమవుతుంది. ప్రైవేటు భూములపై ప్రభుత్వ పెత్తనం ఏంటని వాటిని మళ్లీ ఇప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ప్రధాన ప్రశ్న.

**సోమ్మొకడిది, సోకోకడిది అన్న తీరునా… భూములు ప్రజలవి. వారి కష్టార్జితంతో జీవితకాలంలోనో, లేక పూర్వీకులు కష్టార్జితం వలననో వచ్చిన సంపద. దానికి పలు చట్టపరమైన రిజిస్టర్ కాగితాలు సాక్ష్యం, ఆథారం. అవి ఉంటేనే వారికి సదరు భూ అస్తులు పైన యాజమాన్య, అనుభవ హక్కులు, అథికారాలు ఉంటాయి.
** ఇప్పుడు వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం అంటూ, నూతనంగా భూములు అథునాతన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థ ద్వారా సర్వే జరిపి, శాశ్వత పరిష్కారం, హక్కు, ఆథిపత్యం ఇవ్వడం ఎందుకు?? దాని మీద ఆధిపత్యం ఉన్నప్పుడే హక్కులు ఉన్నప్పుడే కదా వారు భూముల్ని అనుభవిస్తారు… మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా సర్వే చేసి పక్కకు ఇవ్వడం దేనికి? అన్నది ప్రధాన ప్రశ్న.
** ఇప్పుడు అత్యవసరంగా సర్వేలు చేసి భూములకు వైయస్సార్ హక్కులు కొత్తగా ఇవ్వడంలో అసలు అంతర్యం ఏమిటి? వివాదానికి సంబంధించిన భూములు, కోర్టులో ఉన్న భూములు మీద ఎలా సర్వే చేపడతారు అన్నది ప్రధాన ప్రశ్న.


** అసలు ప్రజలకు చెందిన భూములు పైన ఏవరీ పెత్తనం ఎందుకు?? అసలు ప్రజల భూములు పైన పెత్తనం, పేరుతో రాజముద్ర ఏమిటి? వారు ఏమైనా నియంతలా? శాశ్వత పాలకులా? లేక వారి సోంత భూములు ప్రజలకు దానంగానో, కానుకగానో ఏమైనా ఇస్తూన్నారా?
** ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. దాని పైన ప్రభుత్వం ఏరకంగానైనా పెత్తనం, జులుం చేయటం జరగదు. ఇది భారతదేశ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు. డా.బిఅర్ అంబేద్కర్ సారథ్యంలో రచించిన రాజ్యాంగం ప్రకారం ఎటువంటి పరిమితులు, నిర్భంథాలు లేకుండా అనుభవించే శాశ్వత హక్కు. ఈ హక్కుని పౌరుడు ఇష్టానుసారం వాడుకోవచ్చు. దీనికి ప్రభుత్వ పరంగా ఉండే రక్షణ ఏమిటంటే అథికారికంగా రిజిస్ట్రేషన్, యాజమాన్య, అనుభవ హక్కుల థృవపత్రాలు మంజూరు చేయటం వరకే. ఏమైనా ఇబ్బందులు, నిర్భంథాలు, ఉల్లంఘనలు ఉంటే వాటిని న్యాయస్థానంలో మాత్రమే పరిష్కారం చెయాలి. న్యాయస్థానం తీర్పులే అంతిమ నిర్ణయం. ఇది నడుస్తున్న వ్యవస్థ.
** రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ విథానాలు కావని, గ్రామ సచివాలయంలో ఉన్న అథికారులు భూములు రిజిస్ట్రేషన్ ఇకనుంచి చేస్తారంట? అసలు ఏవరు వీరు? వీరికి అథికారం ఏలా దఖలు పడుతుంది? స్టాంపు మరియు రిజిస్ట్రేషన్ చట్టంలో ఏమైనా ఇటువంటి సవరణలు చేశారా? చేసిన పక్షంలో వాటిని థేశాథ్యక్షుడు అనుమతి పోందారా? (కారణం, అది పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన మరియు రాజ్యాంగ థిక్కరణ కాబట్టి)..

పక్కదారి పడితే??

** అసలు ఏవరీ గ్రామ సచివాలయం అథికారులు? వారి సామర్థ్యం ఏమిటి? అసలు ఇటువంటి విథులు వారికి అప్పచెప్పిన పక్షంలో, మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ అథికారులు ఏమీ చేయాలి? సదరు భూహక్కు పత్రాలు డిజిటలైజేషన్ చే అతామంటున్నారు. మరి సదరు డిజిటల్ వ్యవస్థ ఫూల్ ప్రూఫ్ అనే హమీ ఏవరు ఇస్తారు. అత్యంత పకడ్బందీగా రచించబడిన ఆథార్ వ్యవస్థలోనే పలు లోపాలు ఉండి, అవి బహిరంగంగా అమ్ముడుబోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇవి శాశ్వత హక్కు పత్రాలు కావంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం జరిగింది. అటువంటప్పుడు ఈ భూహక్కు, భూరక్షణ పత్రాల డిజిటల్ విథానం రేపు బహిరంగంగా మార్కెట్లో దోరకవు అనే గ్యారంటీ ఏముంది? ఏవరైనా సదరు డిజిటల్ డాక్యుమెంట్లు అనథికారికంగా సవరణలు, మార్పులు చేయలేరు అనే భథ్రత, భరోసా ఏవరు ఇస్తారు? అసలు ఇటువంటి డిజిటల్ వ్యవస్థ భథ్రత ఏంత? ఒకవేళ డిజిటల్ వ్యవస్థతో పాటు, మాన్యూవల్ రికార్డు కూడా ఉండేటట్లు అయితే, వాటిని గ్రామ సచివాలయంలో ఏలా భథ్ర పరుస్తారు? వాటికి భాథ్యులు ఏవరు? అసలు పూర్తి స్థాయిలో భథ్రత కలిపించే సామర్థ్యం ఈ నూతన వ్యవస్థ, అథికారులకు ఉన్నదా? అనేది సందేహమే.


** ప్రభుత్వం చేసిన సర్వే భూములు విషయంలో ప్రజలకు ఎలాంటి అభ్యంతరం వచ్చినా ఎవరు తీరుస్తారు ఎవరు పంచాయతీలు చేస్తారు. అసలు ఈ భూ సర్వే కు సమగ్రమైన చట్టం దాని విధివిధానాలు ఏమైనా ప్రభుత్వం ఆలోచించి ఉందా లేక ఏదో చేస్తున్నామని సాధారణ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ పని కానిస్తున్నార అనేది ప్రశ్న.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?