NewsOrbit
రాజ‌కీయాలు

‘ ఉగ్రవాదం పోవాలంటే మోది రావాలి ‘

నిజామాబాద్‌, మార్చి 6 : నరేంద్ర మోదీయే మళ్ళీ ప్రధాని అవుతారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అమిత్‌ షా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను ఐదేళ్లలో మోది ప్రభుత్వం చేసిందని అమిత్ షా తెలిపారు. దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిజెపి అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే బిజెపి లక్ష్యమని, ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అమిత్ షా అన్నారు.

రానున్న ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాదిస్తుందనీ, మోది ప్రధాని అవ్వటం ఖాయమని అమిత్ షా జోస్యం చెప్పారు. బిజెపి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు అమిత్ షా పిలుపు నిచ్చారు.

రాహుల్ గాంధీ, బీజేపీయేతర కూటమిపై అమిత్ షా ఈ సందర్బంగా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడిన మహా కూటమిలో నాయకులే లేరని అమిత్ షా ఎద్దేవా చేశారు. వారి కూటమికి ఎజెండానే లేదనీ, రాహుల్ గాంధీ ఒక బాబా అని అమిత్ షా అభివర్ణించారు.

కాంగ్రెస్ హాయంలో ఎంతో మంది జవాన్లు దేశం కోసం మరణించినా వారిని పట్టించుకోలేదని అమిత్ షా ఆరోపించారు. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎయిర్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పామని అమిత్ షా అన్నారు.

దాడుల గురించి పాకిస్తానే ప్రశ్నించడం లేదు కానీ రాహుల్‌ గాంధీ మాత్రం వాటికి ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని అమిత్ షా విమర్శించారు.

రాహుల్‌ గాంధీ లాంటి నేతలకు పాకిస్తాన్‌, చైనా లాంటి దేశాలను ఎదుర్కోవడం చేతకాదని ఎద్దేవా చేశారు. కేవలం మోది లాంటి నేతలే ధీటుగా సమాధానం ఇవ్వగలరని వ్యాఖ్యానించార

ఉగ్రవాదం దేశం నుండి పోవాలంటే మరోసారి మోది రావాలని అమిత్ షా అన్నారు. మహ కూటమి అధికారంలోకి వస్తే రోజుకో పార్టీ నాయకుడు ప్రధాని అవుతారని అమిత్ షా ఎద్దేవా చేశారు.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

Leave a Comment