కరోనా వైరస్ కొత్త రూపం కరోనా స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ లో కొత్తగా చాలా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి పలు దేశాలకు విమానాల రాకపోకల్ని రద్దు చేశారు. బ్రిటన్ లో మొదలయిన కొత్త స్ట్రెయిన్ తో యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా స్ట్రెయిన్ ప్రస్తుతం యూరోప్ దేశాలలో విజృంభిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ ను ఆనుకొని ఉన్న దేశాలు సరిహద్దుల్ని మూసివేశారు. మరోవైపు వైద్యులు కొత్త స్ట్రెయిన్ కరోనా కన్నా శరవేగంగా విస్తరిస్తుందని చెబుతుండటంతో ఆయా దేశాల్లో ఆందోళన నెలకొన్నది.
అయితే తాజాగా ఫ్రాన్స్ లో ఈ కొత్త స్ట్రెయిన్ నమూనాలను గుర్తించారు వైద్యులు. ఇక్కడ ఇదే మొదటి కరోనా స్ట్రెయిన్ కేసు. దేశ సరిహద్దుల్లో రాకపోకలను నిలిపివేసే ముందు బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ కు వెళ్లిన ఓ వ్యక్తిలో ఈ కొత్తరకం కరోనా వచ్చిందట. దీంతో ఆ దేశంలోని అధికారులు అతడు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తదుపరి వారందరికీ కరోనా పరీక్షలు చేస్తారట. బ్రిటన్ లో నివసిస్తున్న ఇతను డిసెంబరు 19న తన స్వస్థలమయిన ఫ్రాన్స్ కు వచ్చాడు. వచ్చినప్పుడు అతడిలో కరోనా కి సంబంధించి ఏ లక్షణాలు కనిపించలేదు. అయిననప్పటికీ అతడు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాడు. అయితే డిసెంబర్ 21న వైద్యులు అతడికి పరీక్షలు చేయగా అతనికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు గుర్తించారు.
ప్రస్తుతం ఫ్రాన్స్ లో కరోనా సోకిన వారందరికీ కొత్త స్ట్రెయినా లేక పాత కరోనా అని తెసులుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కరోనా సోకినవారికి కొత్త స్ట్రెయిన్ పరీక్షలు కూడా చేసేస్తున్నారట.