NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ప్రజలకు ముందే సంక్రాంతి.. ! చెల్లింపుల జాతర..!!

 

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (రేపు) రైతుభరోసా, నివర్ తుఫాను నష్టపరిహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 51.59 లక్షల మంది రైతులకు రూ.1,120 కోట్లు చెల్లింపులు చేయనున్నారు.  నివర్ తుఫాను కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతాంగానికి 646 కోట్ల రూపాయల పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. వీటికి తోడు అమ్మఒడి పథకం నిధుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

2021 జనవరి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకం అమలుకు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  జనవరి 9 తేదీన అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకూ చదివే విద్యార్థుల తల్లులకు రూ.15 వేల వంతున ప్రభుత్వం అందించనున్నది. అయితే ఈ 15 వేలలో మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టాయిలెట్స్ మెయింటనెన్స్ ఫండ్, టీఎంఎఫ్) కింద  రూ.1000లు మినహాయిస్తారు.

కాగా రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకూ 72,74,674 మంది, 11,12 తరగతులకు సంబంధించి 10,97,580 విద్యార్థులు అమ్మఒడి పథకానికి ఎంపికైయ్యారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 61,317 పాఠశాలలు, 3,116 కళాశాలలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు అమ్మఒడి లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. జనవరి 9వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో అమ్మఒడి నగదు జమ చేయనున్నారు. గత ఏడాది కంటే లబ్దిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు మంత్రి తెలిపారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju