NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ చేతుల మీదుగా విజయనగరంలో నేడు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ

 

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి 11.15 గంటలకు గుంకలాం చేరుకుంటారు.  అక్కడ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

 

విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం వద్ద 12,301 మంది లబ్దిదారుల కోసం 397.36 ఎకరాల్లో భారీ లే అవుట్ వేశారు. ఇక్కడ ప్రభుత్వం రూ.4.37 కోట్లతో లే అవుట్ అభివృద్ధి చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం రూ.101.73 కోట్లు ఖర్చు చేసి 428 మంది రైతుల నుండి భూమిని కొనుగోలు చేసింది. విజయనగరం జిల్లా మొత్తం 1,08,230 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందిస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్దిదారులు ఉన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం మొత్తం ఈ జిల్లాలో 1,164 లే అవుట్ లను సిద్ధం చేసింది. ఈ లే అవుట్‌ల అభివృద్ధికి రూ.10.19 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.

 

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju