NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పాకిస్థాన్ లో పుట్టి.. ఇండియాకి ఆడి..! చరిత్ర లిఖించిన ఆరడుగుల ఆటగాడు..!

 

మీరు క్రికెట్ అభిమానులా..!? అయితే మీకు పద్దినిమిదేళ్ళు వయసు ఉంటే కోహ్లీ, రోహిత్ లని అభిమానిస్తారు..! మీకు ముప్ఫయి, నలభై ఏళ్ళు ఉంటే సచిన్ ని ఆరాధిస్తారు..! మీకు యాభై ఏళ్ళు దాటి ఉంటే మాత్రం కపిల్ అంటే పడి చస్తారు..! ఆరడుగుల ఎత్తు. ఓవర్ కి ఆరు బంతులు.. ఈ ఆరు బంతుల్లో రెండు స్వింగర్లు.., ఒక యార్కర్, ఒక ఆఫ్ కట్టర్, ఒక బౌన్సర్, ఒక పేస్ ఇలా భిన్నంగా బౌలింగ్ వేసే ఏకైక బౌలర్ కపిల్ దేవ్ మాత్రమే..! దేశంలో క్రికెట్ చరిత్రని మార్చేసి.. దేశంలో క్రికెట్ అభిమానులను పెంచిన గొప్ప క్రికెటర్ ఆయన..!! క్రికెట్ అంటే ఇండియాలో యమా క్రేజు రావడానికి మాత్రం ఆయనే కారణం..! కపిల్ తెచ్చిన క్రేజ్ తో సచిన్ క్రికెట్ దేవుడయ్యాడు, కోహ్లీ స్టార్ అయ్యారు..!! “హర్యానా హరికేన్” అనే ముద్దుపేరుతో క్రీడా అభిమానులు అందరూ పిలుచుకునే కపిల్ దేవ్ పుట్టినరోజు ఈరోజు..! భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించిన అత్యున్నత ఆల్ రౌండర్ గా పేరు సంపాదించిన ఆయన గురించి “ప్రత్యేక కథనం” మీకోసం..!

 

 

టీమిండియాకు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సాధించిన రథసారధి..! 131 టెస్టు లతో పాటు 225 వన్డే మ్యాచ్ లు, తొమ్మిది వేలకు పైగా పరుగులు, టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన పర్ఫెక్ట్ ఆల్ రౌండర్..!

*పాకిస్తాన్ లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామంలో రాంలాల్ నిఖంజ్, రాజకుమారి అనే దంపతులకు 1959 జనవరి 6న జన్మించాడు కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్.
*1971 లో దేశ్ ప్రేమ్ ఆజాద్ శిష్యుడిగా చేరువయ్యాడు. *1975 నవంబర్ లో హర్యానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తొలిసారిగా ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. *1983 జూన్ 18న జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో 175 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించిన కపిల్ భారత్ తరపున తొలి శతకాన్ని నమోదు చేసి, చరిత్రలో మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సాధించి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. *1983 టోర్నీలో భారత్ విజేతగా విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు.

 

ఎన్నో ప్రఖ్యాతులు..!!

*1988లో జోయల్ గర్ల్ రికార్డును అధిగమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించాడు.
*1994లో పాకిస్థాన్కు చెందిన విక్రమ్ రికార్డును అధిగమించి వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు గా స్థానం కైవసం చేసుకున్నాడు.
*1994 జనవరి 30న శ్రీలంకపై బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో న్యూజిలాండ్కు చెందిన రిచర్డ్ హాడ్లీ రికార్డును అధిగమించి , టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా టెస్ట్ క్రికెట్ లో నాలుగు వేల పరుగులు 400 వికెట్లు సాధించిన తొలి ఆల్రౌండర్ గా రికార్డు సృష్టించాడు.
*1999 నుంచి అక్టోబర్ నుంచి 2000 ఆగస్టు వరకు పది నెలల పాటు భారత జట్టుకు కోచ్ గా పని చేశారు.

*2002లో విజయ్ అండ్ పత్రిక చే 20వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్గా కూడా కపిల్ దేవ్ గుర్తింపు పొందాడు.
*అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.
*కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్ గా చలామణి అయ్యారు.

*కబీర్ ఖాన్ కపిల్ దేవ్ బయోపిక్ దర్శకత్వం వహించనున్నారు. 83 అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు.
* కపిల్ దేవ్ పాత్రలో హీరో రణబీర్ నటిస్తున్నారు.
* 83 కపిల్ దేవ్ బయోపిక్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2020 ఏప్రిల్ 10న సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఫిక్సయింది

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju