డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ షూటింగ్ సెట్స్ పైన ఎంత ఫన్నీగా ఉంటాడో తెలియదు కానీ అతను బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో ద్వారా తన లో కామెడీ యాంగిల్ బయటపెట్టిన భాస్కర్… ఆ తర్వాత బయటకు వచ్చి డాన్స్ షో ల లోకి స్పెషల్ ఈవెంట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ నవ్వించడం మొదలుపెట్టాడు.
ఇక ఏదైనా షో లో గెస్ట్ గా వచ్చినా… ఈవెంట్ లో పాల్గొంటున్నా… బాబా భాస్కర్ చేసే సందడి వేరే లెవల్ లో ఉంటుంది. మరో వైపు యాంకర్ రవి చాలా ఏళ్ల తర్వాత లాస్య తో కలిసి సంక్రాంతి ఈవెంట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఒక పెద్ద షో ను యాంకరపెద్ ముందుండి నడిపిస్తున్నాడు. యాంకర్ రవి ఉన్న చోటికి బాబా భాస్కర్ వస్తే అక్కడ కామెడీ యే కామెడీ.
ఇక సంక్రాంతి ఈవెంట్ కి బాబా కూడా రావడం.. రవి కూడా ఉండడంతో కామెడీ బాగా క్లిక్ అవుతుంది. ప్రస్తుతం సంక్రాంతికి ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ అంటూ స్పెషల్ ఈవెంట్ చేశారు. ఇక ఆ తర్వాత లాస్య కనిపిస్తే రవి ఎమోషనల్ అయిపోయాడు. ఆమె ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇంత లోపలే బాబా భాస్కర్ వచ్చి లాస్ట్ ఈవెంట్ కు నీకు ఎంత ఇచ్చారు అని రవి నీ అడిగాడు రెండు లక్షలు అని చెప్పబోతుంటే కరెక్ట్ గా చెప్పు అని బాబా భాస్కర్ బెదిరించడంతో 20 రూపాయలు ఇచ్చాడు. 20 రూపాయలకు తగ్గ పర్ఫార్మెన్స్ చెయ్ చాలు ఎక్కువ వద్దు అని బాబా భాస్కర్ అందరిముందు రవి పరువు తీసేసాడు.