NewsOrbit
రివ్యూలు సినిమా

రివ్యూ : వైట్ టైగర్ – నెట్ ఫ్లిక్స్

ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు, ఆదర్శ గౌరవ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రంవైట్ టైగర్‘. అరవింద్ అడిగా 2008లోవైట్ టైగర్పేరుతో రాసిన అవార్డ్ విన్నింగ్ పుస్తకం లోని కథను అదే పేరుతో చిత్రంగా రామిన్ బహ్రాని దర్శకత్వం వహించి, నిర్మించారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన ట్రైలర్తో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Priyanka Chopra unveils the first look of her new film 'The White Tiger'  co-starring Rajkummar Rao, Entertainment News | wionews.com

కథ

బలరామ్ హల్వాయ్ (ఆదర్శ్ గౌరవ్) ఒక గ్రామంలో నివసిస్తుంటాడు. అతనిది చాలా పేద కుటుంబం. ఇక అతని కుటుంబం అప్పులు తీర్చలేక అతనిని స్కూలు కూడా మానిపించేస్తుంది. ఇంటికి సహాయంగా అతను టీ స్టాల్ లో కూడా పని చేస్తాడు. బలరామ్ కి చిన్నప్పటినుండి అతనికి చాకిరీ చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తుంటాడు. ఇలాంటి సమయంలోనే బాగా ధనికుడైన రాజ్ కుమార్ రావు ఇంటిలో పనివాడిగా చేరతాడు. ఇక టీ స్టాల్లో, మురికివాడల తను గడిపిన జీవితానికి ధనికుడి ఇంట్లో డ్రైవర్ గా ఉంటూ మంచి బట్టలు వేసుకునిఉన్నత జీవితానికి మధ్య తేడాను గమనిస్తాడు. ఆ తర్వాత ప్రస్తుతం అతను తన జీవితానికి అతనికి జీతం ఇచ్చే వారి జీవితానికి మధ్య తేడా కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిదానంగా సమాజంలో కూడా తన గౌరవాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో అతను చేసే పనులు కొన్ని తప్పుదోవ పడుతాయి. ఎలాగైనా చివరికి గొప్ప వాడు కావాలి అన్నది బలరాం ఐడియాలజీ. జీవితంలో ఉన్నత స్థాయి కి వెళ్లడానికి బలరాం ఎలాంటి పనులు చేశాడు…? ఎంత కష్టపడ్డాడు..? చివరికి వెళ్లాడా…. లేదా? అన్నది మిగిలిన కథ.

Priyanka Chopra-Rajkummar Rao sign on 'The White Tiger' for Netflix

ప్లస్ లు

ఎన్నో యాంగిల్స్ లో ప్రేక్షకులను ఆలోచింపజేసే కథ

చాలా శ్రద్ధగా చిత్రీకరించిన క్యారెక్టర్లు

రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రలు

సినిమాటోగ్రఫీ

మైనస్ లు

కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే

కొద్దిగా ఓవర్ అనిపించే సన్నివేశాలు

కేవలం అతికొద్ది పాత్రల మధ్య జరిగే కథనం

మధ్యలో కొద్దిగా మిస్ అయిన డీటెయిల్స్

The White Tiger trailer starring Priyanka Chopra, Rajkummar Rao and Adarsh  Gourav leaves netizens impressed - Social Ketchup

విశ్లేషణ

వైట్ టైగర్పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడిన ఈ చిత్రంలో ఆకాష్ గౌరవ్ పోషించిన పాత్ర నిజంగా అద్భుతమనే చెప్పాలి. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం మామూలు విషయం కాదు. రాజ్ కుమార్ రావు, ప్రియాంక చోప్రా వంటి నటీనటుల పెర్ఫార్మెన్స్ మధ్య అతని హైలెట్. ఇక ఈ సినిమాలోని కథ ఎంతో లోతుగా ఉంటుంది. మన నిజ జీవితం లో జరిగే సన్నివేశాలు పాత్రల కు చాలా దగ్గరగా ఉండేలా దర్శకుడు కథను చిత్రీకరించాడు. పేద, ధనిక, కులాలు, మతాలు, మనుషులు మధ్య అంతర్యాలు వంటి ఎన్నో సున్నితమైన అంశాలను చాలా అందంగా చూపించారు. అయితే ఫిక్షన్ సినిమా కాబట్టి కొన్ని ఎమోషన్స్ సరిగ్గా అతకనట్లు కనిపిస్తాయి. కాకపోతే నటీనటులు తమ పర్ఫార్మెన్స్ తో మాత్రం మనకి ఎక్కడా బోర్ కొట్టనివ్వరు. అక్కడక్కడా లాజిక్ మిస్ అయినప్పటికీ చివరికి వచ్చేసరికి సినిమా మంచి ఫీల్ ఇస్తుంది. ఫారెన్ సినిమాలు చూసేవారు, సందేశాత్మక చిత్రాలు నచ్చిన వారికి ఈ చిత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. కమర్షియల్ కథలు ఇష్టపడే వారికి ఇది ఒకఓకేసినిమా…!

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N