NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Nimmagadda Ramesh Kumar : ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు బదిలీ వేటు లేనట్లే..!!

Nimmagadda Ramesh Kumar : సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారించారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రభుత్వమూ ప్రకటించింది. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని ఎస్ఈసీ తప్పుబట్టింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగైనా బదిలీ వేటు వేస్తారని భావించిన ప్రభుత్వం ముందుగానే వారిని బదిలీ చేయాలని  నిర్ణయాన్ని తీసుకుంది.

Nimmagadda Ramesh Kumar: It seems that there is no transfer hunt for those two superiors .. !!
Nimmagadda Ramesh Kumar: It seems that there is no transfer hunt for those two superiors .. !!

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మా ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ట్రాన్ఫ్‌ఫర్ అయ్యారు, ఇంకా ఎంత మందిని ఆయన (ఎస్ఈసీ) చేసుకున్నా పట్టించుకోము అని వ్యాఖ్యానించారు. దీంతో అందరూ  ఈ ఇద్దరు ఉన్నతాధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాల మేరకే ప్రభుత్వం బదిలీ చేసిందని అనుకున్నారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనూ పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు సహకరించకపోవడం వల్లనే 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆ తరువాత ఆయన ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు ఈ ఇద్దరు అధికారులు గైర్హజరు అయ్యారు. ఈ పరిణామాల క్రమంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఇద్దరు అధికారులకు కూడా ఎస్ఈసీ బదిలీ చేస్తుందని అధికార వర్గాల్లో ఊహగానాలు వచ్చాయి. ఇటీవలే ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ను ఎస్ఈసీ తప్పించిన విషయం తెలిసిందే.

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ యే తిరస్కరించడం. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగవని ఎస్ఈసీ పేర్కొనడం గమనార్హం. ఒక వేళ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే ఎన్నికల విధి విధానాలు పాటించాలని ఎస్ఈసీ సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరుణంలో ముఖ్యమైన ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీ సరైన చర్య కాదనీ, కొత్తగా వచ్చిన అధికారులకు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఎస్ఈసీ స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల విధులకు సహకరించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని గతంలో హెచ్చరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలు అవసరం లేదని ప్రభుత్వానికి ఎస్ఈసీ పేర్కొనడంపై  సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju