NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : మాస్టర్ ప్లాన్ తో దిగిన జగన్ : ఇప్పుడేమి చేస్తావమ్మా నిమ్మగడ్డా ?? ఇక్కడ సుప్రీం కోర్టు కూడా లేదు మరి ?

YS Jagan : jagan master plan ..How nimmagadda intercepts this
YS Jagan : jagan master plan ..How nimmagadda intercepts this

YS Jagan : అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నవరత్న పథకాలను కొనసాగిస్తూ మరో ప్రతిష్టాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. అది ఏమిటంటే  రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానం. రేషన్ సరుకులను నేరుగా కార్డుదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని జగన్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున వాహనాలను సిద్ధం చేసింది. ఇటీవలే విజయవాడలో ఈ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. అయితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా,   ఎన్నికల కోడ్ లేని విజయవాడ నగరంలో జగన్ మూడు జిల్లాలకు చెందిన వాహనాలను ప్రారంభించారు. ఇతర జిల్లా కేంద్రాల్లో అక్కడి మంత్రులు వాహనాలను ప్రారంభించారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్ననేపథ్యంలో రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పిబ్రవరి 1వ తేదీ నుండి నూతనంగా ఎర్పాటు చేసిన వాహనాల ద్వారా డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే డోర్ డెలివరీ వాహనాలు ఆయా మండలాలు, గ్రామ పంచాయతీలకు చేరాయి. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రేషన్ డోర్ డెలివరీ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే ఈ పథకం నూతనంగా తెచ్చింది కాదని చెప్పేందుకు పౌరసరఫరాల శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. 2019 సెప్టెంబర్ నెలలో వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని  పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. అప్పటి నుండి ఆ జిల్లాలో వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానం అమలు అవుతోంది.

YS Jagan : jagan master plan ..How nimmagadda intercepts this
YS Jagan : jagan master plan ..How nimmagadda intercepts this

ఈ విషయాలను పౌరసరఫరాల శాఖ ఎస్ఈసీకి వెల్లడించి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి కోరే అవకాశం ఉంది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ దీనికి మోకాలడ్డే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాలపై సీఎం జగన్ ఫోటోలు, వైసీపీ జండా పోలిన రంగులు ఉండటంతో ఎస్ఈసీ అభ్యంతరం పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానం పాతదే అయినందు వల్ల ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గకుండా అమలునకు పట్టుబడుతుందా? ఎస్ఈసీ ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju