NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS : మౌనంగా ఉండీ ఉండీ పొలిటికల్ బాంబు పేల్చబోతున్న హరీష్ రావు?

TRS : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు KTR(కేటిఆర్) ను ముఖ్యమంత్రి చేయాలని  సీఎం కేసిఆర్ KCR ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కేసిఆర్ మేనల్లుడు, సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి హరీష్ రావు సైలెంట్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుండి మామ కేసిఆర్ వెన్నంటి పార్టీని ముందుకు నడిపిన హరీష్ రావుకు పార్టీ క్యాడర్ లో మంచి పట్టుఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన హరీష్ రావుకే కేసిఆర్ బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. కేసిఆర్ అప్పగించిన బాధ్యతలను హరీష్ రావు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండే వారు. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ఓటమితో హరీష్ రావు తొలి సారిగా పార్టీ అధినేత కేసిఆర్ నుండి అసంతృప్తిని ఎదుర్కొన్నారు.

TRS :  trs minister harishrao silence
TRS : trs minister harishrao silence

ఇక పోతే ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో సీఎం కేసిఆర్ నాయకత్వాన్ని ఎదిరించేవారు ఎవరూ లేకపోయినా కెటిఆర్ కు సీఎం పదవి అంటుంటే వ్యతిరేకించే వారు కూడా ఉన్నారనేది టాక్. ప్రధానంగా హరీష్ రావు ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటూ వస్తున్నారు. కొంత కాలం క్రితం కేటిఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న సమయంలోనూ హరీష్ రావుకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వలేదుట. దీంతో ఆయన అప్పుడు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే నాడు కేటిఆర్ స్వయంగా హరీష్ రావు  నివాసానికి వెళ్లి చర్చలు జరపడంతో అసంతృప్తి తొలగిపోయిందని అంటున్నారు. కాగా కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ భవన్ కు హరీష్ పెద్దగా రావడం లేదని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

TRS : మౌనంగా హరీష్ రావు

మరో పక్క ఇప్పుడు కెటిఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని పలు జిల్లాల నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుతున్నారు. ఇది కూడా కేసిఆర్ ప్లాన్ యేనని కొందరు అనుకుంటున్నారు. ఈ విషయంలో హరిష్ రావును కేసిఆర్ పక్కన పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. కేసిఆర్ ఉన్నంత కాలం హరీష్ రావు విధేయుడుగానే ఉంటారని అయితే ఎప్పటికైనా  టిఆర్ఎస్ కు హరీష్ నుండే ప్రమాదం ఉందని భావించే కేసిఆర్ తొందరగా కుమారుడికి పట్టాభిషేకం చేయాలనే ఆలోచన చేస్తున్నారని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో హరీష్ రావు మౌనంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమవుతుంది.  మౌనంగా ఉఁడీఉండీ ఏమైనా బాంబు పేల్చబోతున్నారా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?