NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Hydrabad Mayor Elections : హైద్రాబాద్ బాద్ షా ఎవరో? బీజేపీ రెడీ.. తెరాసతో ఢీ!

Hydrabad Mayor Elections : హైద్రాబాద్ బాద్ షా ఎవరో? బీజేపీ రెడీ.. తెరాసతో ఢీ!

Hydrabad Mayor Elections : గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి కలిగించే ఘట్టానికి గురువారం రంగం సిద్ధం అయ్యింది. గత ఏడాది నవంబరులో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ Hydrabad Mayor Elections హైద్రాబాద్ బాద్ షా ఎవరో? బీజేపీ రెడీ.. తెరాసతో ఢీ!  మున్సిపల్ ఎన్నికల కీలక ఘట్టం అయినా మేయర్, ఉప మేయర్ ఎన్నిక రేపు జరగనుంది. కొలువుదీరనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేటర్ లు హైద్రాబాద్ తోలి పౌరుడిని ఎన్నుకోనున్నారు. ఈ సారి మహిళలకు సీట్ రిజర్వ్ కావడంతో ఎవరు ఆ అదృష్టవంతురాలు అనేది కూడా అర్ధం కావడం లేదు. ఏ పార్టీకు ప్రస్తుతం మెజారిటీ కు తగిన విధంగా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఇప్పుడు జరిగే పరిణామాల మీద సస్పెన్స్ కొనసాగుతోంది.

ready for hydrabad mayor elections
ready for hydrabad mayor elections

Hydrabad Mayor Elections : కమలం కొత్త ఆలోచనతో!

గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ మేయర్ ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం ఏ పార్టీ కూడా సొంతంగా మేయర్ఎ అయ్యేలా బలం దు. స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాలేదు. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం మీద ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. బిజెపి సైతం తగిన బలం లేకపోయినప్పటికీ రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించడం కీలకంగా మారింది. బిజెపి ముఖ్య నేతలు కార్పొరేటర్ల తో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బుధవారం సమావేశం అయ్యారు. గురువారం మేయర్, ఒక మేయర్ ఎన్నిక సమయంలో అనుసరించాల్సిన వ్యూహం, ఏ విధంగా ఉమ్మడిగా ముందుకు వెళ్దాం అన్న చర్చ జరిగింది. కచ్చితంగా పోటీలో నిలిస్తేనే తెరాస, ఎంఐఎం ల అసలు స్నేహం బయటపడుతుందని, ఇది ప్రజలకు సైతం తెలుస్తుందని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నది బీజేపీ లెక్క. మున్సిపల్ ఎన్నికల సమయంలో నానా మాటలు అనుకున్న టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు రెండు ఒకటే నన్ను సందేశం ప్రజల్లోకి వెళుతుందనేది అసలు ఆలోచన.

Hydrabad Mayor Elections : కారు జోరు అందుకుంటుందా?

గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లు 150 మంది ఉంటారు. వీరిలో ఇటీవల ఒకరు( బీజేపీ )కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 149 మంది మాత్రమే ఉన్నారు. వీరికి అదనంగా మున్సిపల్ కార్పొరేషన్ కు 44 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉంటారు. వీరికి మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంది. అంటే మొత్తం సంఖ్య 193 అన్న మాట. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా మ్యాజిక్ నెంబర్ అయినా 97 మంది సభ్యుల మద్దతు అవసరం. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్కు అధికంగా 31 మంది.. బీజేపీకి ఇద్దరూ, కాంగ్రెస్కు ఒక్కరూ, ఎంఐ ఎం కు 10 మంది సభ్యులు ఉన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 56 స్థానాలకు టిఆర్ఎస్ గెల్చుకుంది. ఆ పార్టీకి ఉన్న 31 మంది ఎక్స్అఫీషియో సభ్యులను కలుపుకుంటే టిఆర్ఎస్ బలం 87. అయితే మేయర్ పీఠం దక్కాలంటే మరో పది మంది సభ్యుల మద్దతు అవసరం. మరి ఈ సమయంలో టీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఏ పార్టీ ను కలుపుకు వెళుతుంది? వ్యూహం ఏమిటి అనేది అంతు బట్టడం లేదు.

Hydrabad Mayor Elections : మద్దతు ఇస్తే దెబ్బ పడదా?

మేయర్ పీఠం దక్కించుకోవాలంటే కచ్చితంగా టిఆర్ఎస్కు ఇంకో పార్టీ మద్దతు అవసరం. తెలంగాణలో ప్రధన పక్షంగా మారాలి అని భావిస్తున్న బిజెపి, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బలమైన పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ ఏ సమయంలో తెరాసతో జత కట్టడం జరగని పని. ఇక మిగిలిన మజ్లీస్ పార్టీ ఒకటే ఇప్పుడు తెరాస కు దిక్కు. తెరాస మజ్లీస్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. మజ్లీస్ మద్దతు తీసుకుంటే కనుక బీజేపీ కు అది ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో పూర్తిగా మద్దతు తీసుకోకుండా కేవలం బయట నుంచి మద్దతు ఇచ్చేలా రాజకీయం నడపవచ్చు. మరి దీనికి ఎంఐఎం నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది కూడా వేచి చూడాలి. మరోపక్క ఒకవేళ తెరాస నుంచి మేయర్ ఎన్నిక కి రంగం సిద్ధమైతే అసలు మేయర్ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది. భారతీ నగర్ డివిజన్ నుంచి గెలిచిన సింధు రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించింది. దాంతో పాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పేరు కూడా ప్రధానంగా ఉన్నప్పటికీ గతంలో బొంతు రామ్మోహన్ మేయర్ గా పని చేసి ఇప్పుడు అదే కుటుంబంలో మరోసారి మేయర్ పీఠం ఇస్తే మధ్య వస్తుందని తెరాస నాయకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju