NewsOrbit
న్యూస్ హెల్త్

Children: మీ పిల్లలు ఇంత సమయం నిద్రపొతున్నారో లేదో చూసుకోండి  .. లేకపోతే  సమస్యలు తప్పవు !!

Children : పిల్లల ఎదుగుదలకు growth ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. శారీరక  పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడాఒక్కొక్కరికి ఒక్కో విదానం ఉంటుంది. నిద్ర తగ్గిన  పిల్లల్లో ఎదుగుదల సమస్య లతో పాటు మానసిక వికాస లోపం కూడా కనబడుతుంది. అయితే ఈ తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటే పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది. చంటి పిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు.  అదే పెద్ద పిల్లలు నస పెడుతుంటారు.

Ideal sleep time for children
Ideal sleep time for children

Children  : నాలుగేళ్ల నుండి పదేళ్ల మధ్యన ఉంటే పిల్లలకు నిద్ర పోయే వేళలు ఇలా ఉండాలి.

4-5 ఏళ్ళ వయసు లోపు పిల్లల కు  11 గంటల 30 నిమిషాల పాటు  నిద్ర పోవాల్సి ఉంటుంది.
5-8 ఏళ్ళ వయసు పిల్లలు  11 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
8-10 ఏళ్ళ వయసు పిల్లలు –  10 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
పిల్లలు సరిపడా నిద్ర పోక పోతే  పిల్లల మనసు నిలకడగా లేక పోవటం వల్ల దేనిమీద  ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువయిన పిల్లల్లో పెద్ద వారిలో ఉన్నట్టే బద్దకం గా  ఉంటుంది. జ్ఞాపకం తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఇవ్వన్నీ కూడ నిద్ర సరిగా లేనందు వల్ల పిల్లలందరిలో కనిపించే లక్షణాలు.
ప్రతి రోజు సాయంత్రం తప్పకుండా స్నానం చేయించడం, వదులుగా ఉండే బట్టలు వేయడం,  రాత్రి భోజనం లో వారు సరిపడినంత  ఆహారం  తీసుకునేల చేయడం, బోజనం అయ్యాక వారితో ప్రేమగా కబుర్లు చెప్పడం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోము కోవటం, లాంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి.

కొన్ని పద్ధతులను పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
1.వయస్సుకు తగ్గట్టుగా  పిల్లల్ని నిద్ర పోయేటట్టు అలవాటు చేయాలి.
2.సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఒకే సమయానికి  పడుకోవటం, లేవడం అలవాటు చేయాలి.
3.సెలవుల్లో  పిల్లలు నిద్ర వేళలు మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, స్కూల్స్  తెరవటానికి కనీసం పది రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.
4. పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే నిద్ర కు అర గంట ముందు వాటిని చూడడం హోం వర్కు చేయటం,చదవటం వంటివి చేయించకూడదు.
5.సాయంత్రాలల, రాత్రిపూట పిల్లలు తినే ఆహారం లో జాగ్రత్తలు  తీసుకోవాలి. సాయంత్రం తరువాత చోక్లెట్స్ కూల్ డ్రింక్స్ తీసుకోకుండా చూడాలి. వీటిలో ఉండే కెఫీన్  నిద్రను పాడు చేస్తుంది.
6.పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలకు  నేర్పించాలి. ‘బెడ్ రొటీన్స్’ అలవాటు చేయాలి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri