NewsOrbit
న్యూస్

VK Sasikala : అదీ చిన్నమ్మ రేంజ్ !డబ్బు వరదలా పారిన తీరు!తమిళనాట ఇదే ఇప్పుడు హాట్ టాపిక్!

VK Sasikala : ఒకటి కాదు..రెండు కాదు, అక్షరాలా 2 వందల కోట్లు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ 23 గంటల ప్రయాణానికి అయిన ఖర్చు.

The way money flooded in Tamil Nadu is a hot topic now!
The way money flooded in Tamil Nadu is a hot topic now!

అంటే, గంటకు 8కోట్ల 60లక్షలకు పైగా ఖర్చన్నమాట. ఏమిటిదంతా అనుకుంటున్నారా..? చిన్నమ్మ శశికళ.. బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన సందర్భంగా ఆమెకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడానికి శశికళ అనుచరులు పెట్టిన ఖర్చు. కేవలం తమిళనాట మాత్రమేకాదు, యావత్ దేశవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

VK Sasikala : అదిరిపోయే రీతిలో ఎంట్రీ !

అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ, తమిళనాడు గడ్డపై గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. వచ్చిందే తడవుగా తమిళనాడు రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తున్నారు కూడా. వచ్చీ రాగానే షాకుల మీద షాకులిస్తూ అన్నాడీఎంకే శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు. ఐతే ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడామె బెంగళూరు టు చెన్నై టూర్‌ మరో ఎత్తు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికొచ్చిన చిన్నమ్మకు ఘన స్వాగతం పలికారు ఆమె అనుచరులు. ఆ గ్రాండ్‌ అరేంజ్‌మెంట్స్‌కైన ఖర్చే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అదొక్కటే మిస్!

బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఔరా అనిపించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు శశికళ అనుచరులు. దాదాపు వంద కార్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ కుంభ స్వాగతాలు, అడుగడుగునా పూలను వెదజల్లుతూ చిన్నమ్మను తమిళనాడుకు తీసుకెళ్లారు. ఐతే హెలికాఫ్టర్‌ నుంచి పూల వర్షం కురిపించాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆ ఒక్కటి మినహా చిన్నమ్మకు బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఐదు గంటలు సాగాల్సిన ప్రయాణం 23 గంటలు పట్టిందంటే ఏ రేంజ్‌లో స్వాగతం పలికారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దారి పొడవునా ఏఎంఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. దీంతో శశికళ తమిళనాడు చేరుకునేందుకు బాగా ఆలస్యమైంది. 23 గంటల పాటు సాగిన శశికళ స్వాగతానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు తెలుస్తోంది. అంటే, గంటకు 8కోట్ల 60లక్షలకుపైమాటే. అంటే.. శశికళ తన బలాన్ని చాటి చెప్పుకునేందుకే ఇంత ఖర్చు చేసి హడావిడి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.రేపటి తమిళనాడు ఎన్నికల్లో సీఎం పీఠాన్ని అధిష్టించడానికి తహతహలాడుతున్న శశికళ ఏ విషయంలోనూ తక్కువ తినలేదని చాటి చెప్పడానికే ఇలా డబ్బును వరదలా పారచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.తద్వారా అన్నాడీఎంకే నాయకులు కార్యకర్తలను ఆకట్టుకోవటం ఆమె వ్యూహం అంటున్నారు.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju