NewsOrbit
రివ్యూలు సినిమా

Akshara Review : అక్షర మూవీ రివ్యూ

Akshara Review :  ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందిత శ్వేత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాఅక్షరనేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదువు పేరుతో జరిగే మాఫియాదానివల్ల నేటి తరం విద్యార్థులు అనుభవిస్తున్న వేదన చిత్రీకరిస్తూ తీసిన ఈ సినిమాకు చిన్నికృష్ణ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

 

Akshara Review akshara movie review
Akshara Review akshara movie review

Akshara Review : కథ 

సంజయ్ భార్గవ్ (సంజయ్ స్వరూప్) విద్యా విధాన్ అనే పేరుతో ఎన్నో విద్యాసంస్థలను నడిపిస్తుంటాడు. అతనికి తన ఇన్స్టిట్యూషన్స్ లో చదివే విద్యార్థులకే టాప్ ర్యాంకులు సాధించాలి అని పట్టుదల ఉంటుంది. దానికోసం ఎంతకి తెగించడానికైనా సిద్ధపడుతుంటాడు. వ్యవస్థలో వారు పెట్టే ఒత్తిడి, టీచర్ల ప్రవర్తన తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కూడా అతను పట్టించుకోడు. ఇలాంటి సమయంలోనే అక్షర (నందిత శ్వేత) లెక్చరర్ గా ఆ కాలేజీలో కి జాయిన్ అవుతుంది. ఇలాంటి సమయంలో తోటి లెక్చరర్ శ్రీ తేజ ఆమెపై మనసుపడి చివరికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఉన్నట్టుండి అక్షర అతనిని కాల్చి చంపేస్తుంది. అసలు అక్షర తేజ ని ఎందుకు కాల్చింది? ఆమె కాలేజీలో చేరడానికి అసలు కారణం ఏమిటి అన్నదే సినిమా…!

ప్లస్ పాయింట్స్

ఈ సినిమా స్టొరీ లైన్ చాలా సాలిడ్ గా ఉంటుంది. నేటితరం సమాజాన్ని చిత్రీకరించేలా విద్యార్థులకు కనెక్ట్ అయ్యేలా మంచి స్టోరీ ని దర్శకుడు తీసుకున్నాడు. అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది.

సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా తీశారు. అలగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సరిగ్గా చేయకపోతే మొత్తం సినిమా దెబ్బతినే అవకాశం ఉంది .కానీ ఈ చిత్రం లో అటువంటి పొరపాటు ఏమీ జరగలేదు.

సినిమా చివర్లో వచ్చే సోషల్ మెసేజ్ కూడా చక్కగా ఉంది. సినిమా మొత్తానికి ఒక ఎండింగ్ లాగా దీనిని పర్ఫెక్ట్ ప్లేస్ లో పెట్టారు.

మైనస్ పాయింట్స్

అంత మంచి స్టోరీ లైన్ ని జాగ్రత్తగా చిత్రీకరించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. సాలిడ్ కథాంశాన్ని ప్రెజెంట్ చేసే విధానంలో అతని అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనపడింది.

సినిమా మొత్తం చాలా స్లోగా నడుస్తుంది. ఒకటి రెండు థ్రిల్లింగ్ మూమెంట్స్ మినహాయించి మిగతా చిత్రం అంతా సీరియల్ తరహాలో సాగుతుంది.

మంచి కథనానికి థ్రిల్లింగ్ అంశాలు తోడు అయినప్పుడు స్క్రీన్ ప్లే ఎంత ఎక్సైటింగ్ గా ఉంటే అంత మంచిది. అయితే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే మాత్రం పెద్దగా బాగోదు. అలాగే మొదటి అర్ధ భాగంలో వచ్చే సీన్లు కూడా లాజిక్ లేకుండా ఉంటాయి.

క్లైమాక్స్ లో జస్టిఫికేషన్ అరకొరగా ఉంటుంది. అలాగే కామెడీ సీన్లు కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి

Akshara Review : విశ్లేషణ

ఒక మంచి స్టోరీ లైన్ తీసుకున్న దర్శకుడు కథను బాగానే రాసుకున్నాడు కానీ దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో ఘోరంగా విఫలమయ్యాడు. సినిమాలో కామెడీ అయితే మరి అవుట్ డేటెడ్ అనిపిస్తుంది. అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ అంశాలు ఉన్నప్పటికీ స్క్రీన్ప్లే ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాకి సంగీతం కొంచెం ప్లస్ అయినప్పటికీ దానితో అందంగా చిత్రీకరించే సీన్లు ఎక్కువగా లేకపోవడం పెద్ద లోటు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక ప్రేక్షకులకి మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసిన సినిమా చుట్టూ మంచి సన్నివేశాలు రాసుకొని ఉంటే ఎంతో బాగుండేది.

చివర మాట : నీరస అక్షర

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N