NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sidiri Appalaraju : మంత్రి సీదిరి స్పీడు మామూలుగా లేదుగా!పలాస లో ఫటాఫటా పాలిటిక్స్!!

Sidiri Appalaraju : శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు వైసీపీ గూటికి చేరారు. మంత్రి సీదిరి అప్పల్రాజు సమక్షంలో ఆ ఇద్దరు వైసీపీ కండువా కప్పుకున్నారు. 21వ వార్డు అభ్యర్థి దేవరశెట్టి బాలాజీ గుప్తా వైసీపీలో చేరిపోయారు. అలాగే 26 వార్డు బీజేపీ అభ్యర్థి మళ్లా రమ్య ఫ్యాన్ గూటికి చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీ తరుఫున నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు వైసీపీలో చేరారు.

 Minister Sidiri Appalaraju Speed ​​is not normal!
Minister Sidiri Appalaraju Speed ​​is not normal!

Sidiri Appalaraju : మంత్రి గారా ?మజాకా?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను గెలిచి మున్సిపల్ ఛైర్మన్ కుర్చీని కైవసం చేసుకునేందుకు మంత్రి సీదిరి అప్పలరాజు వేగంగా పావులు కదుపుతున్నారు. మొన్న టీడీపీ నుంచి నలుగురు కౌన్సిలర్ అభ్యర్ధులను వైసీపీలో చేర్చుకుని టీడీపీకి షాక్ ఇచ్చిన మంత్రి.. తాజాగా బీజేపీ తరఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులను వైసీపీలో జాయిన్ చేసేసుకుని కమలం పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను 135 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 9 వార్డులకు బీజేపీ నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరిని వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో లాగేయడంతో ఇప్పుడు మిగతా అభ్యర్ధులు ఉంటారా లేక వారూ జెండా పీకేస్తారా అనే చర్చ జరుగుతోంది.

ఇంత దిక్కుమాలినతనమా:లోకేశ్!

వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక.. టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ అని ఆరోపించారు. తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయమని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయమని.. అందుకే పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టీడీపీ అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని.. నువ్వొక నాయకుడివి.. నీదొక పార్టీ.. అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.

 

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?