NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Sasikala : శశికళ రాజకీయం సన్యాసం వెనుక అసలు కథ ఇదే..!? ఎందుకు అంత భయపడినట్టు..!?

Sasikala : జైలు నుంచి వచ్చేశారు.. ఇక తమిళనాట దబిడి దిబిడే అనుకుంటే.. చిన్నమ్మ మిడిల్‌ డ్రాప్‌ అయ్యారు. అవును.. జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాలు వదిలేశారు. ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ చిన్నమ్మ రాజకీయాల్ని ఎందుకు విరమించుకున్నట్లు..? అన్ని దారులు మూసుకుపోవడమే కారణమా.. లేక తెరవెనుక ఇంకేమైనా జరిగిందా?అన్నదే ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశం.

This is the real story behind the Monasticism of Sasikala
This is the real story behind the Monasticism of Sasikala

 చిన్నమ్మ చెప్పిందేమిటంటే?

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, డీఎంకేను ఓడించాలని చిన్నమ్మ పిలుపునిచ్చారు.జయలలిత బతికి ఉన్నప్పుడు కూడా తానెప్పుడూ అధికారంలో లేనని.. ఆమె మరణానంతరం కూడా ఆ పనిచేయలేనని శశికళ పేర్కొన్నారు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని… కానీ జయ పార్టీ గెలవాలని, వారసత్వం కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకే మద్దతుదారులంతా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను ఓడించేందుకు కలిసి పనిచేయాలని.. జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయాలని పార్టీ క్యాడర్‌ను కోరారు.

Sasikala : బిజెపికి భయపడే ఈ నిర్ణయం?

అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్నారు. జనవరిలో విడుదలై తమిళనాడులో అడుగుపెట్టారు. వాస్తవానికి ఆమె జైలు నుంచి రావడంతోటే రాజకీయాలు వేడెక్కాయి. అప్పటిదాకా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వర్సెస్ డీఎంకే- కాంగ్రెస్ కూటమి అనుకున్న పోటీ కాస్తా ఆమె రాకతో త్రిముఖ పోటీ తప్పదన్నట్లుగా కథనాలొచ్చాయి. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని కొందరు, వద్దని మరికొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. ఐతే.. ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ఆరేళ్లు నిషేధం ఉండటంతో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ కొనసాగింది. పైగా తనని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి తన సీఎం కోరికకు అడ్డుతగిలిన పళనిస్వామి, పన్నీర్‌ సెల్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? తన మేనల్లుడు దినకరన్‌ స్థాపించిన కొత్త పార్టీలోకి వెళ్తారోనన్న చర్చ కూడా జరిగింది. అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు కోసం, తన పదవి కోసం కూడా ఆమె పోరాటం చేశారు. ఈసీకి, కోర్టులో ఫిర్యాదు చేశారు కూడా. ఈ పరిణామాలు అన్నాడీఎంకే- బీజేపీ కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని అంచనా వేశారు. డీఎంకేను ఢీ కొట్టాలంటే అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో ఐక్యత తప్పనిసరని కమలనాథులతో పాటు అన్నాడీఎంకేలో సీనియర్ నేతలు నిర్ణయించారు.ఇదే ఆమెను భయపెట్టి౦దని సమాచారం.ఒకవేళ తను రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించినా బిజెపి తన వెంట పడవచ్చునని శశికళ భయపడ్డారని చెబుతున్నారు.జయలలిత మరణించగానే ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా మన్నార్ గుడి మాఫియా అంటూ శశికళపై దుమారం రేపడ౦ ఈ సందర్భంగా గమనార్హ౦.ఈ నేపథ్యంలోనే ఇక అనివార్యమై ఆమె రాజకీయాలనుంచే పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

 

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju