NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha Steel Plant : ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ లేఖ..

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళనలకు బీజేపీ మినహా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమానికి అటు తెలంగాణ అధికార పక్షం నుండి మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి రెండు లేఖలు రాశారు. అయినప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత, పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ లేఖ రాశారు.

Visakha Steel Plant JD lakshminarayana
Visakha Steel Plant JD lakshminarayana

ఈ విషయంపై శుక్రవారం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వెనక అనేక మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయన్నారు. విశాఖ ఉక్కు ..ఆంధ్రుల గుండె చప్పుడని అన్నారు. తమ చిన్న తనంలోనే విశాఖ ఉక్కు పోరాటం గురించి చర్చించుకుంటుంటే విన్నామన్నారు. టీమ్ ఇండియా క్రికెట్ లో గెలిస్తే దేశం గెలిచిందని సంబరాలు చేసుకుంటామనీ, అలానే ఉక్కు కర్మాగారం కేంద్రం పరిధిలో ఉంటే మన అందరికీ గర్వకారణమని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇతర సంస్థలతో పాటు చూడకుండా కొన్ని చర్యలతో మళ్లీ గాడిలో పెట్టవచ్చని ఆయన అన్నారు. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేకత విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉందని పేర్కొన్నారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంటేననీ, ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనని అన్నారు.

రానున్న రోజుల్లో స్టీల్ కు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా స్పష్టం చేశారన్నారు. ప్రస్తుతం ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో భారత్‌ రెండవ స్థానంలో ఉందన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరలు కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో స్టీల్ కొనడం కష్టంగా మారుతుందని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహానికి 3200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2200 టన్నుల స్టీల్ ను విశాఖ నుండే పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ మిగిలిన స్టీల్ కంటే విశాఖ స్టీల్ నాణ్యమైనదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందకు గానూ పలు ప్రధానమైన సూచనలు చేస్తూ ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

 

 

 

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju