YS Jagan ; జగన్ పై విశాఖ ఒత్తిడి..! 14 తర్వాత సంచలన నిర్ణయాలు..!?

YS Jagan ; Sensational Decisions after 14ht
Share

YS Jagan ; ఏపీ సీఎం జగన్ పై విశాఖ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఆయన సీఎం అయిన తర్వాత విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని చట్టం కూడా చేసారు. కోర్టు బ్రేకులు వేసింది. ఆ తర్వాత విశాఖ పరిపాలన రాజధానిగా మారలేదు కానీ.., రాజకీయ రాజధానిగా మారిపోయింది. అన్ని పార్టీలు ఆ నగరంపై దృష్టి పెట్టాయి..! తాజాగా స్టీల్ ప్లాంట్ వివాదం పెద్దది అవుతుండడం.., బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఇక్కడ వైసీపీపై ఒత్తిడి ఎక్కువవుతుండడం.. సీఎం జగన్ ని ఇరుకున పెడుతుంది. సాఫీగా సంక్షేమంతో వెళ్తున్న పాలనకు ఇన్ని అడ్డంకులతో ఆయన సతమతమవుతున్నారు..! అందుకే ఈ 14 తర్వాత కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయనున్నట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తుంది..!!

YS Jagan ; Sensational Decisions after 14ht
YS Jagan ; Sensational Decisions after 14ht

YS Jagan ; 14 తర్వాతే నిర్ణయాలు ఎందుకంటే..!?

ఈ నెల 14 కీ.., సీఎం జగన్ నిర్ణయాలకు లింకులు లేకపోలేదు. ఎల్లుండి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఎక్కడా వైసీపీ విజయంపై అనుమానాలు లేవు. ఒక్క విశాఖపట్నంలో మాత్రమే వైసిపికి మ్యాజిక్ ఫిగర్ వస్తుందా..? లేదా అనే అనుమానాలున్నాయి. విశాఖలో వైసీపీకి తిరుగులేదు అనుకునే సమయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో వైసిపికి ఒత్తిడి పెరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదనే వాదన ఉంది. ఇదే నిజమైతే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడుతుంది. అదే జరిగితే చూసి.., చూసి తాను అనుకుంటున్నా పరిపాలన రాజధానిలో రాజకీయంగా బలం కోల్పోడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉండరు. అక్కడ వైసీపీ బలోపేతమే అవ్వాలంటే విశాఖ స్టీల్ ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వైసీపీ వహించక తప్పదు. అందుకే 14 వరకు చూసి… ఫలితాలను సమీక్షించుకుని… తేడా కొడితే మాత్రం కీలక నిర్ణయాలు తప్పకపోవచ్చు..!

YS Jagan ; Sensational Decisions after 14ht
YS Jagan ; Sensational Decisions after 14ht

జిల్లా మొత్తం రాజీనామాలు..!? లేదా ఎంపీలు రాజీనామాలు..!?

విశాఖ స్టీల్ విషయంలో విశాఖ వాసులు వైసీపీపై కోపంగా ఉన్నారా ..? లేదా అనే విషయం ఎల్లుండి తేలనుంది. ఒకవేళ అక్కడ ఫలితం వైసిపికి నిగెటివ్ వస్తే మాత్రం విశాఖ జిల్లా మొత్తం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. తద్వారా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. వైసీపీ రాజకీయ పోరాటానికి దిగినట్టు.. నాయకత్వం వహించినట్టు స్పష్టమవుతుంది. లేదా… 2014 లో ఎంపీలు అందరూ “ప్రత్యేకహోదా” కోసం రాజీనామా చేసినట్టు.., ఇప్పుడు కూడా వైసీపీ ఎంపీల చేత రాజీనామాలు చేయించే ఆలోచన చేతున్నారట..! అదీ కాకపోతే అసెంబ్లీలో విశాఖ ఉక్కుకి మద్దతుగా తీర్మానం చేయడం.. తాను నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవడం.., మంత్రుల బృందాన్ని పంపించడం.. ఇలా ఏదోలా విశాఖ ఉక్కు ఉద్యమానికి వైసీపీ అనుకూలం… అనే సంకేతాలను అక్కడకు పంపించే ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఫలితాలు వైసిపికి పాజిటివ్ గా వస్తే మాత్రం… సైలెంట్ గా ఉక్కు ఉద్యమాన్ని డైవర్ట్ చేసే యోచన చేయవచ్చని వైసిపిలోనే అంతర్గతంగా వినిపిస్తుంది..!!

 


Share

Related posts

Mahesh : మహేష్‌కి జంటగా నివేథా థామస్..?

GRK

వైయస్ జగన్ ను పట్టించుకోవడం మానేసిన చంద్రబాబు! ఎందుకని?

Yandamuri

RRR విషయం లో రాజమౌళి సీరియస్ వార్నింగ్ : దెబ్బకి అలర్ట్ అయిన ఎన్‌టి‌ఆర్ , చరణ్ !

GRK