NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Janasena : టీడీపీ తో జనసేన జత! కొత్త ప్రచారం షురూ!!

Janasena : రాష్ట్రంలో సరికొత్త ప్రచారం.. కొత్త మాటలు, పొత్తు అంటూ తుటాలు జనసేన పార్టీ కి బలంగా తాగుతున్నాయి. ఒకసారి ప్రయోగించి విజయవంతమైన ఫార్ములానే మరోసారి వైఎస్ఆర్సిపి జనసేన పార్టీ మీద మరోసారి తిరిగి ప్రయోగించి జనసేన పార్టీ ఉనికిని పూర్తిగా తుడిచి పెట్టాలని వ్యూహాన్ని తెర మీదకు తెస్తున్నట్లు జనసైనికులు అనుమానిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టి, మునిసిపల్ ఎన్నికల్లో ఉనికి చాట్టుకున్న జనసేన పార్టీని కూకటివేళ్లతో తుంచేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తూ ఉంది అన్నది ఆ పార్టీ నాయకుల ఆరోపణ.  తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి తీరు మీద, తెలంగాణ బిజెపి నాయకుల అంశం మీద వ్యాఖ్యలు చేసిన వెంటనే జనసేన బిజెపి కటీఫ్ అంటూ ప్రచారం మొదలు పెట్టడమే కాకుండా జనసేన పార్టీ బీజేపీని వీడి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని ప్రచారం భారీగా మొదలు పెట్టారు.

new-publicity-to-janasena-tdp-friendship
new-publicity-to-janasena-tdp-friendship

Janasena  టీడీపీతో కలవడానికి పవన్ కళ్యాణ్

** టీడీపీతో కలవడానికి పవన్ కళ్యాణ్ బీజేపీను వీడేందుకు సిద్ధం అవుతున్నారు అన్న ప్రచారం వల్ల జనసేన పార్టీ ఉనికి మీద, పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత మీద ప్రజల్లో అనుమానం కలిగించడమే అసలైన లక్ష్యం. దీనివల్ల పవన్ కళ్యాణ్ మీద వస్తున్న నమ్మకాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అన్నది అసలైన వ్యూహం. అన్నది, మూడో పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎదగనీయకుండా చేసేందుకు ఎప్పటినుంచో వ్యవహరిస్తున్న తీరును తాజాగా కూడా అనుసరిస్తున్నారు.

** బీజేపీలోని తెలంగాణ నాయకుల తీరు పట్ల పవన్ అసహనం వ్యక్తం చేశారు. అంతే తప్ప బీజేపీ అధినాయకత్వం మీద ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బిజెపి అనేది జాతీయ పార్టీ. వారికి కేంద్ర నాయకత్వం సూచనలు ప్రకారం మాత్రమే రాష్ట్ర నాయకులు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే పవన్ వాక్యాలను ఏకంగా బిజెపి పైకి తోసేలా, ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణ బీజేపీ నాయకులు బహిరంగంగా పవన్ పార్టీతో పొత్తు లేదని చెప్పడం, ప్రతిసారి జనసేన పార్టీలో తక్కువగా చూడడం, పత్రికా సమావేశాలు బహిరంగ సమావేశాల్లో నూ జనసేన కు మాకు సంబంధం లేదని తెలంగాణ నేతలు చెప్పడంతోనే అది శృతిమించడంతో పవన్ వ్యాఖ్యలు చేశారు.

అన్నిటికి మౌనంగా ఉంటే జనసేన పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన నోరు తెరిచారు. స్థానిక బిజెపి నాయకుల తీరు మీద మాట్లాడితే, ఏకంగా బీజేపీతో పొత్తుకు రాంరాం చెబుతారు అన్న ఊహ తో ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజెపి

** పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజెపి ను వీడి బయటకు వచ్చే అవకాశం తక్కువ. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్థానిక నాయకులు ఇష్టానుసారం చేస్తున్న వ్యాఖ్యలను తేలికగా తీసుకుని వదిలేయడం వల్ల కూడా ప్రజల్లో ఒక రకమైన చులకన భావం ఏర్పడుతుంది.

దీనిని నిరోధించేందుకు పవన్ స్థానిక బిజెపి నాయకుల తీరు పట్ల బహిరంగంగా మాట్లాడారు. దీనిలో ఆయన పార్టీని రక్షించుకోవడం, జన సైనికులకు మనో ధైర్యం చెప్పడం కనిపిస్తుంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇతర పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జనసేన పొత్తు ఉండటం లేదని ప్రచారం ఎత్తుకున్నారు.

** ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లోనూ ఇటు మునిసిపాలిటీ ఎన్నికల్లోనూ టిడిపి కు జనసేన తీవ్రమైన నష్టం చేసింది. దాదాపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టిడిపి తో పాటు జనసేన పంచుకున్నాయి. దీంతో అధికార పార్టీకి మున్సిపాలిటీల్లో సులువైన విజయాలు దక్కాయి. అంటే జనసేన పార్టీ ఎదుగుదల టీడీపీకే ప్రమాదం.

మరి ఈ సమయంలో టీడీపీతో పవన్ జత కలుస్తారని చెప్పడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనేది అధికార పార్టీకే తెలియాలి. టిడిపిని దెబ్బ మీద దెబ్బ కొడుతున్న జనసేన పార్టీ ని తొక్కేయాలని కుట్రలో భాగంగానే అధికార పార్టీ విపక్షం కలిసి ఈ కొత్త కుట్రకు తెరలేపారు అని చెప్పొచ్చు.

** ఆంధ్రప్రదేశ్లో మూడో పార్టీ వస్తే అది క్రమక్రమంగా బలపడితే ఇటు టీడీపీతో పాటు అటు వైఎస్ఆర్సిపి కీలక నేతలకు చాలా ప్రమాదం. అధికారం బయట వ్యక్తుల చేతికి వెళ్లేందుకు వీరు ఇష్టపడరు. దీనిలో భాగంగానే మూడో వ్యక్తి బలపడుతున్నరు అన్న సమయంలో ఏదో ఒక పుకార్లు ప్రచారం ఉండేది ఆ పార్టీ మైలేజ్ దెబ్బ తీయడం ప్రత్యేకత.

** ప్రజారాజ్యం పార్టీ సమయంలోనూ ఇలాంటి కుట్ర జరిగింది అన్న విషయం జనసేన నాయకులు కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. చిరంజీవి పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం, టిడిపి లోని కొందరు కోవర్టులు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో తీరని అన్యాయం చేశాయి.

ఎన్ని ప్రచారాలను చేసినా పట్టుకొని 18 సీట్లు సాధించాడు చిరంజీవి. ఆ ప్రచారాలు లేకపోతే కచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటులో చిరంజీవి కీలకంగా వ్యవహరించే వారు. అయితే మూడో వ్యక్తిని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రానివ్వకూడదు ఎజెండాతో పనిచేస్తున్న నాయకులు చిరంజీవిని అప్పట్లో తొక్కేశారు.

** 2019 ఎన్నికల్లో టిడిపి జనసేన ఒక్కటే అన్న ప్రచారం వైయస్సార్సీపి జోరుగా చేసింది. దీని వల్ల మంచి ప్రయోజనం పొందింది. ఈ ఫార్ములా ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో మరోసారి దీనినే ప్రయోగించాలని జనసేన పార్టీ ఉనికిని పూర్తిగా తుడిచి వేయాలి ఆంధ్రప్రదేశ్ లో భారీగా కుట్ర జరుగుతుందని చెప్పాలి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?