NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

BIHAR : బీహార్ అసెంబ్లీ లో అసలేం జరిగింది?

BIHAR : బీహార్ అసెంబ్లీలో జరిగిన జరిగిన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీలోకి పోలీసులు వచ్చి శాసనసభ్యులను ఎడాపెడా లాక్ ఏలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో? ఎందుకు పోలీసులు అలా తీసుకెళ్తున్నారో అర్థం కాక చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

బీహార్ లో జరిగిన సంఘటనలను ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్ ఖండించారు. బీహార్ అసెంబ్లీలో నితీష్ ప్రభుత్వం ఒక నెల చట్టం ప్రవేశ పెట్టిందని, దానిని వ్యతిరేకిస్తూ సభ్యులు అంతా లేచి నిలబడ్డ మమ్మన్నారు. అంతలోనే సభ బయట నుంచి భారీగా పోలీసులు లోపలికి వచ్చి శాసన సభ్యులను ఇష్టానుసారం లాక్కొని వెళ్లడంతో పాటు, అడ్డు వచ్చిన వారిని కొట్టుకుంటూ బయటకు తీసుకు వెళ్లడం ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

ఇలా జరగడం బీహార్ లోనే కాకుండా దేశ చరిత్రలోనే మొదటిసారి అని, చట్టసభల్లో కి పోలీసులు వచ్చి ఇస్తానుసరం సభ్యులపై చేయి చేసుకోవడం ఎక్కడాలేదని విపక్షాలు ఆందోళన బాట పడుతున్నాయి. అంతేకాకుండా సభలో వెనుకబడిన వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే దేవినేని జుట్టు పట్టుకొని పోలీసులు లాక్కెళ్లారు అని, ఆమె చీర పూర్తిగా జారిపోతున్న ఆమె ఇడ్చుకుంటూ తీసుకువెళ్లడం పట్ల నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీలో జరిగిన ఈ హింసాత్మక ఘర్షణలు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు పోలీసులు మీడియా సిబ్బంది సైతం గాయాలయ్యాయి. అయితే అసలు గొడవ ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది పోలీసులు రంగ ప్రవేశం ఎందుకు చేశారు అన్న దానిపై స్పష్టత లేదు. సోషల్ మీడియాలో అసెంబ్లీ గొడవ కు సంబంధించిన ఎన్నో మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో సభలో పోలీసులు పోలీస్ అధికారులు ఎమ్మెల్యేలను తన పిరుదులు కురిపించటం స్పష్టంగా కనిపిస్తోంది.

బీహార్లో విపక్షాలు గత కొన్ని రోజులుగా అధికార పక్షంపై మాటల దాడి చేస్తున్నాయి. తాజాగా అధికారపక్షం బీహార్ స్పెషల్ ఆర్మ్ పోలీస్ బిల్ 2021 ను తీసుకొచ్చింది. దీనిని భారీ గందరగోళం మధ్య మంగళవారం సభలో ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే కోర్టు వారెంట్ లేకుండానే, పోలీసులు ఎవరిమీదైనా అనుమానం పడిన సందేహించినా వారిని అరెస్టు చేసి జైలుకు పంపించే అధికారులు వారికి లభిస్తాయి అన్నది విపక్షాల ఆందోళన కు ప్రధాన కారణం. అటు అధికార పక్షం మాత్రం ఈ బిల్లు ద్వారా పోలీసు దళాలకు సంబంధించినది అని, శాంతిభద్రతల విభాగం పోలీసులు ఇది సంబంధించింది కాదని చెబుతోంది.

బీహార్లో ఎమ్మెల్యేలపై సభలో చర్య తీసుకోవడానికి ముందు పట్టణ రహదారులపై కూడా ఆర్జెడి నేతలకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో కొత్త బిల్లు మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని భావించారు. అయితే దీనికి పట్టణ జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. దీంతో తేజస్వి యాదవ్ వెనక్కు తగ్గకుండా వేలాది మంది పార్టీ కార్యకర్తలతో మార్పు చేస్తూ వచ్చారు. దీంతో పోలీసులకు ఆర్జెడి కార్యకర్తలకు మధ్య హింసాత్మకమైన సంఘటనలు జరిగే రెండు వైపులా రాళ్లు రువ్వుకున్నారు. దీని తర్వాత సభలో అసలు హంగామా మొదలైంది.

బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ప్రతిపక్షం ఆర్జెడి ప్రత్యేక వ్యూహం ప్రకారం సభకు వచ్చింది. ఒకవైపు రోడ్డుమీద తేజస్వి యాదవ్ నేతృత్వంలో నిరసన జరుగుతుంటే మరోవైపు సభలో ఎమ్మెల్యేలు సైతం నిరసన తెలిపారు. దీంతో బయట, లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారపక్షం బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నం చేయడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ బయటకు రాకుండా ఆయన ఛాంబర్ ముందు ధర్నా చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో స్పీకర్ పోలీసులను సభ లోపలికి పిలిపించారు.

పట్నా ఎస్పీ తో పాటు డిస్టిక్ మేజిస్ట్రేటు ఇద్దరు పోలీసులు తమ బలగాలతో లోపలికి రాగానే ఎమ్మెల్యేలు వారిని చూసి మరింత రెచ్చిపోయారు. ఈ గొడవ లోనే పలువురు ఎమ్మెల్యేలను బలవంతంగా పోలీసులు బయటకు లాక్కెళ్లల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలన్నీ కొందరు సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అవన్నీ దేశ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. చట్టసభల్లో పోలీసుల తీరు మీద నెటిజన్లు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju