NewsOrbit
Featured రాజ‌కీయాలు

TDP ; పుట్టుట గిట్టుట కొరకే..! కంగారు వద్దు – ఈ విషయము గూర్చి శోకింప తగదు..!!

TDP ; Anniversary Wishes Lokesh

TDP ; జాతస్య హి ధ్రువః మృత్యుః – ధ్రువం జన్మ మృతస్య చ.. – తస్మాత్ అపరిహార్యే అర్థే న త్వం శోచితుం అర్హసి..!!
“పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు…!”

మనుషులకే కాదు.. జంతువులకు, బొమ్మలకు, వస్తువులకు, పార్టీలకు, నాయకత్వాలకు అన్నిటికీ ఈ శ్లోకం వర్తిస్తుంది. ప్రస్తుతం టీడీపీ గురించి ఈ వాక్యాలు, శ్లోకాలు కాస్త జత చేసుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఆ పార్టీ అంతరించిపోతుందనో.., గిట్టిపోతుందనో కాదు..! పార్టీ ప్రస్తుత పరిస్థితులు. ప్రాక్టికల్ వాస్తవాలు. తమ నిజ బలం. ప్రత్యర్థి పార్టీ బలం. తమ నిజ బలహీనత.. రియాలిటీ అంచనా వేసుకుని చక్కదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవేమి చేయని పక్షంలోనే ఆ పార్టీ కార్యకర్తలు పైనున్న “భగవద్గీత శ్లోకాన్ని” పఠించుకోవాలి..!!

TDP ; Anniversary Wishes Lokesh
TDP ; Anniversary Wishes Lokesh

TDP ; లోకేష్ ఏం నేర్చుకుంటున్నట్టు..!?

పార్టీకి పెద్ద మైనస్ నారా లోకేష్.. టీడీపీలో ఇంటాబయటా జరుగుతున్న చర్చ ఇదే. చంద్రబాబు కష్టంతో, ప్రణాళికతో పార్టీని పైకి లేపాలని చూసినా.., లోకేష్ రూపంలో పార్టీని కిందకు దించే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. లోకేష్ రాజకీయ నడవడిక సరైన దారిలో లేదు. ఆయన రాజకీయం సరైన దారిలో ఆరంభం కాలేదు. ఇప్పటికీ సరైన దారిలో వెళ్లడం లేదు. ఇలాగే కొనసాగితే సరైన దారిలో వెళ్లే అవకాశమూ లేదు..! షార్ట్ కట్ లో నాయకుడయ్యారు. షార్ట్ కట్ లో ప్రజాప్రతినిధి అయ్యారు. షార్ట్ కట్ లో మంత్రి అయిపోయారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు, క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన తరుణంలో “నటన”కి ప్రాధాన్యత ఇస్తున్నారు. తన పార్టీ నేతలకు, తన అభిమానులకు, తన వర్గానికి తన అసలు “నటన” చూపిస్తున్నారు. వాళ్ళ మాట వింటున్నట్టు.., వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు.., తాను మారుతున్నట్టు.., తాను నాయకుడిగా ఎదిగిపోతున్నట్టు.., తాను కష్టపడుతున్నట్టు తెగ నటిస్తున్నారు. తాను ఒక కోటరీలో.., ఒక బృందంలో కూరుకుపోయానన్న నిజాన్ని గ్రహించక బోరింగ్ సినిమా పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రాక్టికల్, రియాలిటీలోకి రాలేకపోతున్నారు..!

TDP ; Anniversary Wishes Lokesh
TDP ; Anniversary Wishes Lokesh

అర్ధం లేని మాటలు.. పసలేని వాదనలు..!!

లోకేష్ కి వయసు బోలెడు ఉంది. యువతకి దగ్గరయ్యే చనువు ఉంది. కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ తాను మంత్రి అయినప్పుడు తనకు భజన చేసే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే బృందం ఇప్పటికీ కొనసాగుతుంది. నెలవారీ జీతాలు, రోజువారీ భజనలతో ఆ బృందం గడిపేస్తుంది. వారే లోకేష్ సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తారు. వాళ్ళే లోకేష్ కి సలహాలిస్తుంటారు. అర్ధం లేని మాటలు, పసలేని వాదనలతో లోకేష్ ని సంతృప్తి పరుస్తుంటారు. లోకేష్ సంతృప్తి చెందితే చాలదు. పార్టీ శ్రేణులు సంతృప్తి చెందాలి. టీడీపీలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. పార్టీ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు భజన బృందాలు ఉన్నాయి. వాళ్ళని రియాలిటీ తెలుసుకోనివ్వరు. తెలుసుకున్నా జీర్ణించుకోలేరు. ఈ క్రమంలోనే పార్టీలో క్షేత్రస్థాయిలో తిరిగే నేతలకు కొన్ని వాస్తవాలు తెలుస్తున్నా… అవి పార్టీ పెద్దలకు చేరడం లేదు. చేరినా పట్టించుకోవడం లేదు. టీడీపీలో ఇప్పుడు కేవలం బలవంతపు నాయకత్వం.. పెయిడ్ సోషల్ మీడియా బృందం.. భజనలు చేసే బృందం.. మాత్రమే చెల్లుబాటు అవుతుంది. పార్టీపై శ్రద్ధ పెట్టి.. అలా కాదు, ఇలా చేద్దాం అనే నాయకత్వానికి విలువ దక్కడం లేదన్నది అంతర్గత వాదన. ఇది ఇలా కొనసాగేంత కాలం పార్టీ పూర్వ స్థితికి చేరడం కష్టమే..!!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju