NewsOrbit
న్యూస్

House rental ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు  ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!!

ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు  ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!!

House rental : అద్దె ఇంట్లో కి వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం.
సొంత ఇల్లయినా, అద్దె ఇల్లయినా ఏదైనా కూడా  వాస్తురీత్యా ఉండడం చాలా అవసరం. సొంత ఇల్లు కల నెరవేరాలంటే  అద్దెకుండే ఇల్లు కూడా వాస్తురీత్యా బాగుండాలి. మీరు ఉండే ఇల్లు పల్లెలో అయినా, పట్నంలో అయినా సరే వాస్తురీత్యా ఉండాలి. కాబట్టి అద్దె ఇంట్లో కి వెళ్లే వాళ్ళు  ఆచితూచి అడుగు వేయడం మంచిది. అద్దె ఇంటిలోకి వెళ్లే ముందు నైరుతి, దక్షిణ, పశ్చిమాలలో మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో  గమనించుకోవడం చాల ముఖ్యం.

People must remember this while renting a house
People must remember this while renting a house

అలాగే ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఈశాన్యంలో ద్వారం, గృహం మధ్య ఖాళీ ఉండాలి. నైరుతిలో బాల్కనీ ఉండకూడదు. ప్రతి పోర్షన్ చదరంగా లేదా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండటం మంచిది. వృత్తాకారంలో మాత్రం ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా నైరుతి గది కి  నైరుతిలో ద్వారం ఉండకూడదు.ఇంటి ఆవరణలో వాస్తుకు అనుగుణంగా మాత్రమే నూతులు, గోతులు ఉండాలి. చెడు వీధిపోట్లు, చీకటిగా ఉండి గాలి, వెలుతురు రానివి, రోడ్డు నుంచి బాగా పల్లంగా ఉన్న ఇళ్ళు ఉండడానికి మంచిది కాదు.

టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది. ఇవి మాత్రమే కాక మీకు కుదిరితే  ఆ పోర్షన్ ఇంతకుముందు నుంచి అద్దెకు ఇస్తున్నదైతే ఇంతకుముందు అద్దెకున్న వారికి ఎలా ఉండేది, కలిసి వచ్చిందా లేక ఏవైనా ఇబ్బందులు పడ్డారా అన్న విషయం తెలుసుకొని దాన్నిబట్టి అద్దెకు దిగడం మంచిది. పైకి బాగానే కనిపించిన గతంలో అద్దెకు ఉన్న వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు, నానా విధములైన ఇబ్బందులు కలిగించే పోర్షన్ లు , తరచూ ఖాళీ అయ్యే పోర్షన్ లు తీసుకోకుండా ఉండడమే మంచిది .

ప్రమాదాలు, అకాల మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగిన పోర్షన్ లు  తీసుకోకుండా ఉండడమే మంచిది.  అసలు వాస్తు బాగున్న ఇళ్ళు తరచూ ఖాళీ అవ్వవన్న విషయాన్ని మరిచిపోకండి. ఈ రోజుల్లో  ఇల్లు దొరకడమే కష్టం గా ఉంటే ఇంకా ఇవన్నీ ఎక్కడ చూసుకోము అని అనకండి… మీ పరిస్థితులు అన్ని సవ్యం గా ఉండాలంటే ఆ మాత్రం ఓపికతో వెతుక్కోక తప్పదు.

 

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?