NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP vs BJP: బీజేపీ పిటిషన్ – వైసీపీకి తలనొప్పులు..!?

YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt

YSRCP vs BJP: ఏపీలో నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం మలుపులు తిరుగుతున్నది. ఎన్నికను రద్దు చేయాలని చంద్రబాబు ప్రెస్ మీట్లకు పరిమితం అవుతుండగా.., బీజేపీ ఒకడుగు ముందుకేసింది. ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ ఏకంగా కోర్టుకెళ్లారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి.. మళ్ళి పోలింగ్ నిర్వహించాలంటూ కోర్టులో నిన్న పిటిషన్ వేశారు. దీంతో ఏపీలో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఆ ఎన్నికల సందర్భంగా వచ్చిన వీడియోలు, సోషల్ మీడియా ప్రచారంతో ఆత్మరక్షణలోకి వెళ్లిపోయిన వైసీపీకి ఈ పిటిషన్ అంశం ఇంకాస్త తలనొప్పిగా మారింది.

YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt
YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt

YSRCP vs BJP: పెద్దిరెడ్డి కౌంటర్ ఫలించలేదు..! కానీ..!!

ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధమైనవి. రాజ్యాంగంలో ఎన్నికల తతంగం చాలా కీలకమైనది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తతంగం పై విమర్శలు, తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ రోజున అనేక వీడియోలు, ఓ వర్గం మీడియాలో అనేక వార్తలు ప్రసారమయ్యాయి. కానీ అధికార పార్టీ దీన్ని అంగీకరించలేదు. మంత్రి పెద్దిరెడ్డి “ఆ బస్సులో ప్రయాణికుల తిరుపతి దర్శనానికి వస్తున్నారంటూ” చెప్పారు. కానీ ఇది పెద్దగా జనాలకు వెళ్ళలేదు. టీడీపీనే దొంగ ఓట్లు వేస్తుంది అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. దీనికి తాజాగా రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. “నిజంగా టీడీపీ దొంగ ఓట్లు వేస్తే.. వైసిపినే కోర్టుకి వెళ్లొచ్చు కదా..? ఉప ఎన్నిక రద్దు చేయమని కోరవచ్చు కదా..!? అని ప్రశ్నించారు. కీలక పాయింట్ లాగి, పార్టీని ఇరుకున పెట్టేసారు. దీంతో ఈ టాపిక్ ఇంకా సాగుతుంది.

YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt
YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt

అధికారులు చెప్పటినా… బీజేపీ మాత్రం తగ్గలేదు..!!

వైసీపీ వాదనకి అధికారులు కూడా వంతపాడారు. అక్కడక్కడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారు దొరికినట్టు వచ్చిన వీడియోల ఆధారంగా అయినా చర్యలకు ఉపక్రమిస్తే కొంచెం ఈ వ్యవహారం చల్లారేదెమో.. కానీ పోలీసులు కనీసం కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం కూడా చేయలేదు. పైగా డీజీపీ గారేమో ఎన్నికలు ప్రశాంతంగా, బాగా జరిగాయని కితాబిచ్చారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా ఈ ఎన్నికలు చాల బాగా జరిగాయంటూ చెప్పుకొచ్చారు. కొన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వీడియోలు వచ్చినా వాటిని దాటవేశారు. ఈ వ్యవహారాలన్నీ గమనించిన బీజేపీ కన్నెర్ర జేసింది. ఎన్నికలు రద్దు చేసి మల్లి పోలింగ్ నిర్వహించాలి అంటూ మొదటి నుండి చెప్తూనే ఉంది.. తాజాగా నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అభ్యర్థి రత్నప్రభ నేరుగా కోర్టుకి వెళ్లారు. హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు నంబర్ 206300127342021 గా ఇది నమోదయింది. దీనికి ప్రతివాదిగా కేంద్ర ఎన్నికల కమీషన్ ని చేర్చారు. దీంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.

YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt
YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt

వామ్మో తీర్పు తేడా కొడితే..!?

కోర్టులో ఏదైనా ఒక కేసు విచారణకు స్వీకరిస్తే మొదట వాదనలు వింటుంది. ఇరు పక్షాల వాదనలు తర్వాత ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలిస్తుంది. ఆపై ఒక తీర్పుని ఇస్తుంది. సో.. కోర్టు వాదనల్లో వైసీపీ డొల్లతనం అందరికీ తెలిసిందే. సో.. ఇక్కడ కూడా కోర్టులో తమని తాము సమర్ధించుకోడానికి వైసిపికి సరైన అధరాలు, సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది. సమర్ధనీయం వాదనలు వినిపించాలి. ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి బీజేపీ దగ్గర బోలెడన్ని ఆధారాలున్నాయి. ప్రసార మాధ్యమాల క్లిప్పింగులు, వీడియోలు ఉన్నాయి. సో.. కోర్టు వాదనల్లో బీజేపీ వాదన ఒక అడుగు ముందుకే ఉంటుంది. దీనికి వైసీపీ/ ప్రభుత్వం సిద్ధమవ్వాలి. తగిన వాదనలు సిద్ధం చేయాలి. టీడీపీ/ బీజేపీ దొంగ ఓట్లు అనే విషయంపై ప్రాధమిక ఆధారాలైనా సేకరించాలి. లేకపోతే పొరపాటున ఈ తీర్పు తేడాగా వస్తే జగన్ ఖ్యాతి జాతీయ స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది..!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?