ట్రెండింగ్ న్యూస్

Bigg boss Abhijeet : మాల్దీవుల్లో బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్… ఎంజాయ్ మెంట్ అంటే నీదే భయ్యా?

bigg boss abhijeet maldives trip
Share

Bigg boss Abhijeet : బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ గురించి తెలుసు కదా. ఆయన మాట్లాడే ప్రతి మాటకు, చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. అందుకే.. అభిజీత్ తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన వేసే పంచ్ లు కూడా మామూలుగా ఉండవు. నిజానికి అభిజీత్ బాగా రిజర్వ్ డ్. చాలా తక్కువ మాట్లాడుతాడు కానీ.. మాట్లాడే దాంట్లో విషయం ఉంటుంది. అదే బిగ్ బాస్ 4 విన్నర్ గా చేసింది అభిజీత్ ను.

bigg boss abhijeet maldives trip
bigg boss abhijeet maldives trip

బిగ్ బాస్ 4 విన్నర్ అయ్యాక అభిజీత్ కు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. టాప్ ప్రొడ్యూసర్ కూడా అభిజీత్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అభిజీత్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు. కానీ… అభిజీత్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదట. అభిజీత్ ఏదైనా సినిమాకు కమిట్ అయితే… ఆ సినిమా కథ నూటికి నూరు శాతం అభిజీత్ కు నచ్చాలి. అప్పుడే అభిజీత్ ఓకే చెబుతారు. అయితే… ఇప్పటి వరకు అభిజీత్ కు చాలా ఆఫర్లు వచ్చినా.. వాటన్నింటినీ కాదనుకొని… తనకు నచ్చిన ప్రయాణాన్ని చేస్తున్నాడు అభిజీత్.

Bigg boss Abhijeet : ట్రావెలింగ్ లో పీక్స్ కు వెళ్తున్న అభిజీత్

ఎవ్వరికైనా ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవ్వరూ ఉండరు. అభిజీత్ కూడా అంతే. తనకు తిరగడం ఇష్టం.. కొత్త కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టం.. ట్రావెలింగ్ చేయడం ఇష్టం. అందుకే… ఎప్పుడూ తన వెంట ఓ కెమెరాను వేసుకొని ప్రపంచమంతా చుట్టేసి వస్తుంటాడు అభిజీత్. తాజాగా అభిజీత్… మాల్దీవుకు చెక్కేశాడు. అక్కడ అభిజీత్ చేసిన ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు. అభిజీత్ అంటే అది. లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేయాలో… అభిజీత్ ను చూసి నేర్చుకోవచ్చు అని చెబుతున్నారు అభి అభిమానులు.

తాజాగా మాల్దీవుల్లో తను చేసిన ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా అభిజీత్ మాల్దీవుల వీడియోను చూసేయండి.


Share

Related posts

‘పారదర్శకంగా ఇసుక విక్రయాలు’

somaraju sharma

Lock down: తెలంగాణ‌లో లాక్ డౌన్ స‌డ‌లింపు… కొత్త రూల్స్ ఏంటంటే..

sridhar

బిగ్ బాస్ 4 : ఎలిమినేషన్ కు ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..! 

arun kanna