NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

RRR: తిరుపతి దొంగ ఓట్లపై రఘురామ యుద్ధం..! దేశద్రోహమంటూ అమిత్ షాకు లేఖ..!

raghurama krishna raju letter to amit shah

RRR: రఘురామకృష్ణ రాజు RRR వైసీపీ రెబల్ ఎంపీ మరో వివాదాస్పద అంశంపై పోరు మొదలుపెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ తీరుపై, నాయకుల చర్యలపై మండిపడే ఆయన ఏకంగా పార్టీ అధినేత.. ఏపీ సీఎం జగన్ నే టార్గెట్ చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పు ఈ నెల 27న రానుంది. ఇప్పుడు మరోసారి తన మార్క్ స్టయిల్ తో ముందుకొచ్చారు. రీసెంట్ గా జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల అంశం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయాన్నే తీసుకుని ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

raghurama krishna raju letter to amit shah
raghurama krishna raju letter to amit shah

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ విపరీతంగా దొంగ ఓటర్ కార్డుల ముద్రణ జరిగిందని ఆరోపించారు. దీనిని దేశద్రోహంగా పరిగణించాలని కోరుతూ ఏకంగా హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసి సంచలనం రేపారు. దేశ సార్వభౌమాధికార సమగ్రతకు దొంగ ఓట్ల ముద్రణ ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇది దేశానికి జరుగుతున్న నష్టంగా పరిగణించాలని ఫిర్యాదు చేశారు. లక్షలాదిగా దొంగ ఓటర్ కార్డులు ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఇటువంటి ఐడీ కార్డులు తయారుచేసి ఓట్లు వేయడం సాధారణమైపోతుందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ దేశద్రోహానికి పాల్పడ్డాయని ఆరోపించారు.


ఈక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఇటువంటి సంఘవిద్రోహ శక్తులను అరికట్టాలని అన్నారు. ఈ సంఘటనలను తాను వదిలిపెట్టనని, కేంద్రంతో పోరాడైనా విచారణ జరిపేలా ఒత్తిడి తీసుకొస్తానని అంటున్నారు. ఇప్పటికే తిరుపతి ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ అంశాన్ని ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది. దీంతో రఘురామ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. మరి.. రఘురామ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N