RRR : ఆర్ఆర్ఆర్ 2022 కి పోస్ట్ పోన్ అంటే రాజమౌళి రియాక్షన్స్ చూసి అందరూ షాకవుతున్నారట. ప్రపంచ వ్యాప్తంగానూ ఎన్నో వందల కోట్ల కళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఫిక్షన్ కథాంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ రాజమౌళి ఈ ప్రచారాలకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా కూల్ గా ఉన్నాడట.
బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వాస్తవంగా ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల షూటింగ్ దశలో ఆగిపోయింది. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటే షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 13న విజయదశమి పండుగ సందర్భంగా అన్నీ ప్రధాన భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వీఎఫెక్స్ వర్క్ చాలానే పెండింగ్ ఉండటంతో మళ్ళీ పోస్ట్ పోన్ అయి 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
RRR : ఆర్ఆర్ఆర్ మాత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు.
అయితే ఈ వార్తలు విన్న రాజమౌళి నవ్వుకుంటున్నారట. ఆ నవ్వుకు అర్థం ఏంటంటే.. అనుకున్న సమయానికి అన్నీ పూర్తైతే రిలీజ్ పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం పాన్ ఇండియన్ సినిమాకేంటీ అని సింపుల్ గా సమాధానం చెబుతున్నాడట. అంటే ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న వచ్చేయడం పక్కా అని రాజమౌళి మాటల్లో తెలుస్తోంది. ఒకవేళ అన్నీ సినిమాలు పోస్ట్ పోన్ అయి ఆర్ఆర్ఆర్ కి కాంపిటీషన్ అయితే మాత్రం మేకర్స్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేము. అయితే ఏ సినిమా సంగతి ఎలా ఉన్నా ఆర్ఆర్ఆర్ మాత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు.