NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: బెయిల్ అయితే ఇచ్చింది..! నోటికి తాళం కూడా వేసింది..!! రఘురామకు సుప్రీం షరతులు ఇవీ..!

Supreme Court: రాజద్రోహం ఆరోపణలతో ఏపి సీఐడి అరెస్టు చేసిన వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు సుప్రీం కోర్టు బెయిల్ అయితే ఇచ్చింది కానీ ఆయన ఊహించని షరతులు విధించింది. గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామ కృష్ణంరాజును ఇటీవల ఏపి సీఐడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడి విచారణలో ఉన్న సమయంలో ఆయన పాదాలకు గాయం కావడం, దానికి సీఐడీ అధికారులే హింసించారంటూ ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.

MP RRR case Supreme Court bail conditions
MP RRR case Supreme Court bail conditions

దీనిపై రఘురామ తనయుడు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, సీఐడి కస్టడీలోనే గాయాలు అయ్యాయని పేర్కొనడంతో విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు వైద్య పరీక్షల నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల మద్య వాదనలు వాడివేడిగా జరిగాయి. అనంతరం రఘురామకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Supreme Court: రఘురామకు ఇవీ షరతులు..

మీడియా, సోషల్ మీడియా ముందు మాట్లాడకూడదు. ఎలాంటి వీడియోలు పోస్టు చేయకూడదు. ఇంతకు ముందులా కాళ్లు చేతులు చూపించే విన్యాసాలు చేయొద్దు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. సీఐడీ విచారణకు పూర్తిగా సహకరించాలి. లక్ష పూచికత్తును ట్రయల్ కోర్టులో జమ చేయాలి.

రఘురామకు బెయిల్ రాగానే మళ్లీ మీడియా ముందుకు వచ్చి ఇంతకు ముందు కంటే రెచ్చిపోతారంటూ ఆయన వర్గీయులు భావించారు. అయితే సుప్రీం కోర్టు పలు షరతులు విధించడంతో బెయిల్ వచ్చిందన్న ఆనందం ఆయన వర్గీయుల్లో క్షణాల్లో ఆవిరి అయ్యింది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella