NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SSC Exams: ఏపిలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై మెజార్టీ ఉపాధ్యాయ సంఘాల మాట ఇది..!!

SSC Exams: ఏపిలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టలేదు. రోజు వేల సంఖ్యలోనే కేసులు నమోదు అవుతున్నాయి. లక్షకు పైగా పరీక్షలు కోవిడ్ టెస్ట్ నిర్వహిస్తే 20వేలకు పైగా లక్షల లోపు టెస్ట్ లు నిర్వహిస్తే 20వేలకు తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఓ పక్క వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పదవ తరగతి పరీక్షలను ఇతర రాష్ట్రాలకు మాదిరిగానే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్షలను రద్దు చేసే ఉద్దేశం లేదని, పరీక్షల నిర్వహణ అనేది విద్యార్ధుల భవిష్యత్తు కోసమేననీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే పేర్కొన్నారు.

ap education minister suresh comments on SSC Exams
ap education minister suresh comments on SSC Exams

 

Read more: CBI: బిగ్ బ్రేకింగ్.. సీబీఐ కొత్త బాస్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో దాదాపు దేశంలోని 14 రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేశారనీ, సీబీఎస్ఈ కూడా పరీక్షలు రద్దు చేసిందని గుర్తు చేస్తూ ఏపిలోనూ పరీక్షల రద్దుకు సూచనలు చేయాలంటూ లోకేష్ రాశారు.

 

SSC Exams: పరీక్షల నిర్వహణకే మెజారిటీ ఉపాధ్యాయ సంఘాల మద్దతు

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల నిర్వహణపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంలో పరీక్షలను జరపాలనే మెజార్టీ సంఘాలు సూచించాయట. ఉపాధ్యాయుల సూచలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయితే పిల్లల భవిష్యత్తుతో పాటు ఉపాధ్యాయుల భద్రత కూడా ముఖ్యమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదనే అభిప్రాయాన్ని కొన్ని సంఘాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపినందున ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేక వచ్చే నెల మొదటి వారంలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపిన తరువాత నిర్ణయాన్ని వెల్లడిస్తుందా వేచి చూడాలి.

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N