NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Eetala Rajendar: బీజేపీలో చేరకముందే పార్టీలో కాక..! కీలక నేత రాజీనామాకు సిద్ధం..!!

Eetala Rajendar: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరిక ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ వ్యవహారం అప్పుడే ఆ పార్టీలో అగ్గి రాజేస్తుంది. ఆయన బీజేపీలో చేరితే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఒకప్పటి టీడీపీ ముఖ్యనేత, ప్రస్తుత బీజేపీ ఇంచార్జి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీ నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. టీఆరెస్ లోకి వెళ్లి హుజురాబాద్ నుండి బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం..!

disturbance in bjp even before eetala rajendra joining in the party
disturbance in bjp even before eetala rajendra joining in the party

ఇదీ పెద్దిరెడ్డి రాజకీయ ప్రస్థానం!

టిడిపి లో పెద్దిరెడ్డి ఒక వెలుగు వెలిగారు.1994, 1999 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి పెద్దిరెడ్డి గెలవడమే కాకుండా మంత్రి కూడా అయ్యారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో ఉన్న ట్రస్టెడ్ లెఫ్టినెంట్లలో పెద్దిరెడ్డి ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.అయితే 2004 లో ఓటమి అనంతరం పెద్దిరెడ్డి గ్రాఫ్ పడిపోయింది. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యంలో చేరి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. తిరిగి టీడీపీలోకి వచ్చి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 2018 లో ఆయన సైలెంట్ అయిపోయారు. 2019లో ఆయన బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు. అయితే ఇంతలో ఈటెల ఎపిసోడ్ మొదలైంది!

Read More: Anandaiah Medicine: ఆనందయ్య మందు పంపిణీపై ఆయుష్ కమిషనర్ ఏమన్నారంటే…!?

రాజేందర్ పై రగిలిపోతున్న పెద్దిరెడ్డి

బీజేపీలో తనకు ఎదురుండదని, హుజురాబాద్ టిక్కెట్ తప్పనిసరిగా లభిస్తుందనే ఆశతో ఉన్న పెద్దిరెడ్డికి రాజేందర్ రాహువులా తయారయ్యారు.తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీ అగ్రనేతల ఆఫర్ కి ఒప్పుకుని ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఓకే చెప్పేశారని సమాచారం. 2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ, ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వని ఈటల రాజేందర్‌ పార్టీ మారి బీజేపీలో చేరితే ఇక తనకంటూ అవకాశం ఉండదని పెద్దిరెడ్డి గ్రహించారు.రాజేందర్ బిజెపిలో ప్రవేశించిన మరుక్షణమే పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గతంలో పెద్దిరెడ్డి పనిచేసి ఉన్నందున, ఎంతో కొంత ఫేస్ వాల్యూ ఉన్నందున ఆయన్ను టీఆర్ఎస్ ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదు.మరిప్పుడు ఈటల కోసం పెద్దిరెడ్డిని బిజెపి వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి .

 

Related posts

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju