NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Corporate Negligence:హైదరాబాదులో మరో కార్పోరేట్ ఆసుపత్రి నిర్వాకం..! బిల్లు చెల్లించలేదని వైద్యం నిలిపివేత..!!

Corporate Negligence: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోగుల పట్ల పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ జరిమానా వేస్తున్నా, లైసెన్సు కాన్సిల్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా పలు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు తమ దోపిడీని యదేశ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని అధికారుల తనిఖీల్లోనూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేడు హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పటల్ జరిగిన ఓ దారుణ ఘటన వెలుగుచూసింది.  కరోనాతో చికిత్స పొందుతున్న రోగి పెండింగ్ లో ఉన్న రూ.12వేలు చెల్లించలేదని వైద్యం నిలిపివేయడంతో ఆమె మృతి చెందింది.

Corporate Negligence: patient died in lb nagar
Corporate Negligence: patient died in lb nagar

Read More: warangal central jail: త్వరలో అదృశ్యం కానున్న 135 ఏళ్లనాటి వరంగల్లు సెంట్రల్ జైలు భవనం ఇదే..! స్టార్ట్ అయిన ఖైదీల తరలింపు..!!

వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి మల్లంపేటకు చెందిన రాధ (51) కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా కారణంగా రాధ భర్త కొద్ది రోజుల ముందే చనిపోవడంతో తల్లిని కాపాడుకోవడంతో ఆమె పిల్లలు కామినేని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గత 18 రోజులుగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్‌ఫెక్షన్ ఉందని చికిత్స చేస్తున్నారు. ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి రూ.6 లక్షలకుపైగా చెల్లించారు. అయినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించలేదు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బాధితురాలి కుటుంబ సభ్యులు బిల్లు చెల్లించలేదని ఆసుపత్రి సిబ్బంది వైద్యం నిలిపివేశారు.

గత అయిదు రోజులుగా ట్రీట్మెంట్ కు సంబంధించి రిపోర్టులు అడుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది ఇవ్వలేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. నిన్న మంగళవారం రూ.80 వేలు చెల్లించే వరకూ ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదని రాధ కుటుంబ సభ్యులు  ఆరోపించారు. ఈ రోజు ఉదయం గుండె పోటుతో మృతి చెందిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. 20 రోజుల క్రితం తండ్రిని కోల్పోయిన ఈ పిల్లలకు ఇప్పుడు తల్లి కూడా చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని వారు ఆందోళన చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇటువంటి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.

Related posts

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?