Pushpa: డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు “ఉప్పెన” సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అని అందరికీ తెలుసు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ని మాత్రమే కాక చాలామందిని పైకి తీసుకు వచ్చే రీతిలో సుకుమార్ సపోర్ట్ చేస్తూ వారికి లైఫ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు ని బాగా సపోర్ట్ చేయడంతో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా “ఉప్పెన” సినిమా చేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఇపుడు బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో డబల్ త్రిబుల్ గా మారుమ్రోగుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు అదే రీతిలో “పుష్ప” పార్ట్ 2 కి సుకుమార్ కి హెల్ప్ చేయబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే ఇటీవల బుచ్చిబాబు పుష్ప పార్ట్ 1 చూడటం జరిగింది అని చెప్పుకొచ్చాడు. సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా ఉందని, తన గురువు డైరెక్టర్ సుకుమార్ పై ఈర్ష్య కలుగుతుందని, స్టోరీ ఆ రీతిగా వ్రాయటం జరిగిందని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చేయని యాక్టింగ్ అల్లు అర్జున్ ఈ సినిమాలో చేశాడని బన్నీ పై పొగడ్తల వర్షం కురిపించారు.
Read More: Pushpa: పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటించే ప్రాజెక్ట్ ల వివరాలు..!!
మునుపెన్నడూ లేని విధంగా బన్నీ పెర్ఫామెన్స్ ఈ సినిమాలో ఉందని ఆకాశానికి ఎత్తేశాడు. కచ్చితంగా బన్నీ చేసినట్టు ఇండస్ట్రీలో మరో హీరో ఆ క్యారెక్టర్ కి న్యాయం చెయ్యలేరు అన్నట్టు డైరెక్టర్ బుచ్చిబాబు మార్కులు వేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ గనుక ఇప్పుడే పాటలు మార్కెట్ లో రిలీజ్ అయితే బాగుండు అన్న రీతిలో ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తంమీద చూసుకుంటే 10 కేజిఎఫ్ సినిమాలు కలిపితే ఒక “పుష్ప” సినిమా అవుతుంది అంటూ బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు.