NewsOrbit
న్యూస్

AP CM YS Jagan: ఏపిలో కర్ఫ్యూ అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

AP CM YS Jagan key comments on curfew

AP CM YS Jagan: ఏపిలో అమలు అవుతున్న కర్ప్యూపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 తర్వాత సండలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగుతుందని బుధవారం జరిగిన స్పందన సమీక్షలో సీఎం జగన్ పేర్కొన్నారు. మే 5వ తేదీ నుండి విధిస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇచ్చిందన్న సీఎం జగన్..20వ తేదీ తరువాత సడలింపులు ఇస్తూ కర్ఫ్యూను మరి కొన్ని రోజులు కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో  కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని అన్నారు.

AP CM YS Jagan key comments on curfew
AP CM YS Jagan key comments on curfew

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటి వరకూ మూడున్నర కోట్ల మందిలో 69లక్షల మందికి సింగిల్ డోస్ ఇచ్చినట్లు వెల్లడించారు.  ఇప్పటి వరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. 89 శాతం కోవిడ్ బాధితులను ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.

Read More: AP Government: రాజధాని రైతులకు వార్షిక కౌలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

కాగా ఈ నెల 22న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి గానూ కలెక్టర్ లు అంతా సిద్ధం కావాలని ఆదేశించారు. అదే విధంగా వచ్చే నెలలో విద్యా దీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తామని పేర్కొన్న వై ఎస్ జగన్ జూలై 1న వైఎస్ఆర్ భీమా పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N