NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్టు

AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు న్యాయ సమీక్షలో నిలబడలేకపోతున్నాయి. తాజాగా మరో కీలక ప్రాజెక్టు విషయంలోనూ ఏపి హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఏపి ప్రభుత్వం చేపట్టనున్న మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్లను ఏపి హైకోర్టు రద్దు చేసింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సైతం తాజాగా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది.

AP High Court cancelled Mega solar power project tenders
AP High Court cancelled Mega solar power project tenders

పవర్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉందని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపి విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి పరిధి హక్కులను పీపీఏ తొలగించడం చట్ట విరుద్ధమని టాటా ఎనర్జీ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేందుకు వీలు ఉంటుందని పేర్కొనడం టెండర్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని టాటా ఎనర్జీ పేర్కొంది. ప్రభుత్వ తరపు న్యాయవాది రైతాంగ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం టెండర్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

Read More: AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! మాన్సాస్ ట్రస్ట్ జీవో కొట్టివేత..!!

రెండు రోజుల క్రితమే మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ట్రస్ట్ నియామక ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా గత నెలలో సంఘం డెయిరీ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అంతకు ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇలా వరుసగా హైకోర్టులో ఏపి ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వీటిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N