NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్యకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రశంసలు..!!

Anandaiah Medicine: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఖ్యాతి దశధిశలా వ్యాపించింది. చాలా సంవత్సరాలుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం నిర్వహిస్తున్నా రాని పేరు ప్రఖ్యాతులు ఆయన ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోనా మందును ప్రభుత్వం నిలుపుదల చేయడంతో వచ్చింది. నేడు ఆయన ఖ్యాతి పొరుగు రాష్ట్రాలకు తెలిసింది. ఆనందయ్య పంపిణీ చేసిన ఆయుర్వేద ఔషదంతో వేలాది మంది కరోనా నుండి విముక్తి కావడంతో మౌత్ పబ్లిసిటీ ద్వారానే నెల్లూరు పరిసర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడు, కర్నాటక నుండి వందలాది మంది కృష్ణపట్నం వచ్చి మందులు తీసుకువెళ్లేవారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో లోకాయుక్త ఆదేశాలతో అధికారులు ఆనందయ్య మందు పంపిణీని నిలుపుదల చేశారు.

Anandaiah Medicine: madras high court Appreciation
Anandaiah Medicine: madras high court Appreciation

Read More: Delta Plus: కలవరపెడుతున్న డెల్టా ప్లస్..! మధ్యప్రదేశ్‌లో రెండు మరణాలు నమోదు..!!

ఆ తరువాత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం..ఆనందయ్య మందుపై పరిశోధనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్, ఆయుష్ తదితర వైద్య బృందాలు ఆనందయ్య తయారు చేసిన మందులపై పరిశోధనలు జరిపి ప్రమాదకరం కాదని నిర్ధారించడం, దాంతో హైకోర్టు కూడా మందు పంపిణీకి అనుమతులు ఇవ్వడం తెలిసిందే. అనంతరం ప్రభుత్వ సహకారం లభించకపోయినా ఆనందయ్య వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో వారి వారి నియోజకవర్గాల్లో పంపిణీకి మందు తయారు చేసి ఇస్తున్నారు. అనేక మంది నేతలు, ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అనందయ్యను అబినందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయనను అభినందిస్తూ ఘనంగా సత్కరాలు చేస్తున్నారు.

తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆనందయ్యను ప్రశంసించారు.  డీఆర్‌డీఓ తయారు చేసిన 2 డీజీ మందుపై విచారణ సందర్భంలో ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపిలో కరోనాకు మందును తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అబినందించింది. న్యాయమూర్తులు జస్టిస్ కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ లు ఆనందయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.

ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంలో భారతీయ ఎడిసన్ గా పేరుగాంచిన జీడీ నాయుడును ధర్మాసనం గుర్తు చేస్తూ అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఉంటారన్నారు. అందరూ రామన్ పిళ్లై లాంటి మోసగాళ్లు ఉంటారన్న ఆందోళన తగదని అన్నారు. బయో ఇంథనం పేరుతో జనాలను మోసం చేసిన కేసులో రామన్ పిళ్లై అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju