NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: షర్మిలపై గులాబీ పార్టీ గూడుపుఠాని మామూలుగా లేదుగా!వైఎస్సార్ ను టార్గెట్ చేయడం అందుకేగా??

YS Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు టార్గెట్ చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ముందు చూపుతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటున్నారు.

TRS Party Targets YS Sharmila
TRS Party Targets YS Sharmila

ఇంకో పది రోజుల్లో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను దృష్టి లో పెట్టుకొని ఈ రాజకీయ చాణక్యాన్ని కెసిఆర్ నడుపుతున్నారని చెబుతున్నారు.తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పదే పదే చెబుతున్నా షర్మిల ముందు కాళ్లకు బంధం వేసి ప్రక్రియే ఇదంటున్నారు.ఆమె తండ్రి తెలంగాణ ద్రోహి అని ఒక బ్రాండ్ వేయడానికి ,తద్వారా షర్మిలకు జనామోదం లభించకుండా చేయడానికి ఈ రాజకీయ క్రీడను కెసిఆర్ ఆడుతున్నట్లు సమాచారం.

వైఎస్సార్ పై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు!

ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఒంటికాలిపై లేస్తున్నారు.చనిపోయి పదేళ్లు దాటిన తర్వాత కూడా వారు రాజశేఖర్రెడ్డిని వదిలిపెట్టడం లేదు.నిజానికి గతంలో కూడా ఇలాంటి జల వివాదాలు వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో పెద్దగా రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ మంత్రులు విమర్శించిన దాఖలాల్లేవు.ఈసారి మాత్రం రాజశేఖర్రెడ్డి నీటిదొంగ అంటూ కేసీఆర్ సన్నిహితుడైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గొంతెత్తారు.తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తీవ్రంగా రాజశేఖరరెడ్డి అవమానించడంతో మాజీ సీఎల్పీ నాయకుడు పి జనార్ధన్ రెడ్డి గుండెపోటుతో మరణించారని,ఆయనకు సమీపంలో ముఖ్యమంత్రి అంబులెన్స్ లో ఉన్న డాక్టర్లు వైద్య సహాయం అందించలేదని కూడా మంత్రి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న మావోయిస్టు నాయకులను రాజశేఖర్రెడ్డి చర్చల పేరుతో పిలిచి చంపించేశారని ఆయన ఇంకో అభియోగం మోపారు.తెలంగాణ జలాలు, నిధులు,ఉద్యోగాలను రాజశేఖర్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి మళ్లించేశారని ఆ మంత్రి చెప్పారు.అసలు రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.

మంత్రి మాటల్లో మతలబు ఏంటంటే!

ఈ విధంగా మంత్రుల చేత మాట్లాడుకోవడం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని,ఈ ప్రాంతానికి చాలా అన్యాయం చేశారని ప్రజల్లోకి ఫీలర్స్ పంపటమే టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.అలాంటి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏమి ఒరగ పెట్టబోతోందన్న అభిప్రాయాన్ని ప్రజలలో నాటడమనేది టీఆర్ఎస్ మరో ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీ పెట్టే సమయంలో గానీ, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో కానీ షర్మిల తప్పనిసరిగా రాజశేఖరరెడ్డి గురించి ప్రస్తావిస్తారు కాబట్టి ముందే ఆయనను విలన్ గా చేసి చూపడం,తద్వారా షర్మిలను ప్రజలు అనుమానించే పరిస్థితి తేవడం గులాబీ పార్టీ సాగిస్తున్న గూడుపుఠాణీ అంటున్నారు.

 

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?