NewsOrbit
జాతీయం న్యూస్

CC Road disappeared: ఆ గ్రామంలో సీసీ రోడ్డు మాయం అయ్యింది..! పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో అవాక్కైయిన అధికారులు..! అదేంటో చూడండి..!!

CC Road disappeared

CC Road disappeared: పలు గ్రామ పంచాయతీల్లో చిత్రాలు, విచిత్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని వెలుగులోకి వస్తుంటాయి. మరి కొన్ని వెలుగులోకి రావు. గ్రామాల్లో కొందరు తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఉంటారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు, సర్పంచ్ లు ఇంజనీరింగ్ అధికారులతో కుమ్మక్కు అయి పలు అక్రమాలకు పాల్పడుతుంటారు. రోడ్డు వేయకుండా వేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు కైంకర్యం చేస్తుంటారు. అవి ఎప్పుడో ఒక సారి నిజాయితీ గల అధికారి తనిఖీకి వచ్చిన సందర్భంలోనో లేక కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు రికార్డులు పరిశీలించినప్పుడో వెలుగులోకి వస్తుంటాయి.

CC Road disappeared
CC Road disappeared

Read more: AP Telangana Water War: పులివెందుల పులి బిడ్డ ఏంటి ఆలా తగ్గిపోయాడు..! కేసీఆర్ అంటే భయపడుతున్నట్లేనా..!?

ఓ సినిమాలో పోశాని కృష్ణమురళి తన చేపల చెరువును దొంగలు ఎత్తుకు పోయారు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చాలా మందికి గుర్తే ఉండి ఉంటుంది. అదే విధంగా ఓ గ్రామంలో మా ఊళ్లో రోడ్డు మాయం అయ్యింది అంటూ ఫిర్యాదు రావడం అక్కడి అధికారులను అవాక్కు అయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీదీ జిల్లాలో నమోదు అయిన ఓ పోలీస్ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తమ గ్రామంలో నిర్మించిన కిలో మీటరు మేర రోడ్డు దొంగతనానికి గురైందంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కల్గించింది.

 

విషయంలోకి వెళితే.. సీదీ జిల్లాలోని మేద్రా గ్రామంలో 2017లో మట్టి రోడ్డు నిర్మించారు. ఆ తరువాత ఆ రోడ్డును సిమెంట్ రోడ్డుగా అభివృద్ది చేసినట్లు రికార్డుల్లో చూపారు. పంచాయతీ రికార్డులో సిమెంట్ రోడ్డు వేసినట్లుగా ఉండి, గ్రామంలో అక్కడ సిమెంట్ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఈ విధంగా ఫిర్యాదు చేశారు. రోడ్డు దొంగతనం గురించి విన్న పంచాయతీరాజ్ అధికారి ప్రజాపతి ఆశ్చర్య పోయారు. ఇలాంటి ఘటన గురించి తాను మొదటి సారి వింటున్నానని పేర్కొన్నారు. రోడ్డు దొంగతనం అనడం సరైంది కాదని పేర్కొన్న ఆయన తాను కొత్తగా ఇక్కడికి బదిలీ పై వచ్చాననీ, దీనిపై పూర్తి సమాచారం లేదన్నారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రహదారి నిర్మించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే రోడ్డు నిర్మించినట్లు బిల్లులు చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఎవరి హయాంలో ఈ అవినీతి జరిగింది. అప్పటి అధికారులు ఎవరు అనేది తేలనున్నది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N