NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

AP TS Water War: ఏపి అధికారులకు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు

AP TS Water War: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ జరుగుతున్న వేళ ఏపి అధికారులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ జెన్‌కో నుండి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించేందుకు ఏపి అధికారులు వెళ్లగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఏపి, తెలంగాణ మధ్య జల జగడం నడుస్తున్న వేళ ప్రాజెక్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జల విద్యుత్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. గురువారం నాడు మాచర్ల నుండి డీఎస్పీ, ఆర్డీఓ, ఎన్ఎస్పీ ఎస్ఈలు సాగర్ కు వెళ్లగా నూతన వంతెన వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

AP TS Water War: TS police sent back AP officers in Nagarjuna sagar
AP TS Water War: TS police sent back AP officers in Nagarjuna sagar

విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని ఏపి అధికారులు కోరినా తెలంగాణ పోలీసులు నిరాకరించారు. దీంతో ఏపి అధికారులు జెన్ కో సీఈఓకు ఫోన్ చేసి తమ వినతిపత్రం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అందుకు సమ్మతించలేదు. వినతి పత్రాన్ని డీఐజీకి ఇవ్వాలని సమాధానం చెప్పడంతో ఏపి అధికారులు వెనుతిరిగారు. తొలుత రైట్ బాండ్ గెస్ట్ హౌస్ లో నల్లగొండ జిల్లా ఎస్‌పి రంగనాధ్, గుంటూరు జిల్లా ఎస్‌పీ విశాల్ గున్ని సమావేశమైయ్యారు. అనంతరం గుంటూరు ఎస్‌ప రంగనాధ్ సాగర్ జలాశయం నూతన వంతెన వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు.

ఇటు పులిచింతల వద్ద కూడా పోలీస్ బందోబస్తు పెంచారు. ప్రాజెక్టులో నీరు సగం నిండకండానే తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం సరికాదని ప్రాజెక్టు అధికారులు తెలంగాణ జెన్ కో కు లేఖ రాశారు. అయినా విద్యుత్ ఉత్పత్తి ఆపకపోవడంతో నేరుగా అధికారులు చర్చలు జరపాలని భావిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడకుండా గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్‌పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. పులిచింతల జల విద్యుత్ కేంద్రం వద్ద సూర్యపేట జిల్లా పరిధిలో తెలంగాణ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?