NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Speaker: వైసిపి అల్టిమేటమ్ ని ఖాతరు చేయని లోక్‌సభ స్పీకర్!పద్దతి ప్రకారమే నడుచుకుంటానని ప్రకటన!సేఫ్ జోన్ లో ఆర్ఆర్ఆర్??

Lok Sabha Speaker: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అంత సులువుగా అనర్హత వేటు పడే అవకాశాలు కనిపించడం లేదు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసిపి తీవ్రస్థాయిలో లోక్‌సభ స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. సంవత్సర కాలంగా తమ పిటిషన్ పెండింగ్ లోఉందని, ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుంటే పార్లమెంటును స్తంభింపజేస్తామని వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.నేత రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో స్పీకర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

Speaker of the Lok Sabha did not care about the YCP ultimatum!
Speaker of the Lok Sabha did not care about the YCP ultimatum!

Lok Sabha Speaker: ఇరుపక్షాల వాదనలు వింటానన్న స్పీకర్!

ఈ నెల 19 వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్ల గురించి స్పీకర్ మీడియాతో సోమవారం మాట్లాడారు.ఈ సందర్బంగా ఆర్ఆర్ఆర్ అనర్హత అంశం ప్రస్తావనకు వచ్చింది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అనర్హత పిటీషన్ సెక్రటేరియట్ పరిశీలనలో ఉందని స్పీకర్ వెల్లడించారు.ప్రతి నిర్ణయం తీసుకొనేదానికీ ఒక విధానం ఉంటుందని,అదే ఈ విషయంలోనూ ఫాలో అవుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.రఘురామ అనర్హత అంశం పైన పైన నిత్యం మాట్లాడలేమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకొనే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు.రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవటం ఆలస్యమైతే లోక్‌సభ ను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్‌.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు.

స్పీకర్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే?

ఇరువర్గాల వాదనలు విన్నాక ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పటం ఈ వ్యవహారంలో కీలకాంశం.అంటే వైసిపి డిమాండ్ చేసినట్లు ఈ విషయంలో వెనువెంటనే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోబోవడం లేదని స్పష్టం అవుతోంది.పైగా ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని కూడా స్పీకర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇరుపక్షాల వాదనలు వినడమంటే ఇంకొంతకాలం ఈ విషయం నానబోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పార్లమెంటు సమావేశాల వరకూ కూడా రఘురామకృష్ణంరాజు సేఫ్ జోన్లో ఉంటారు.ఈ పరిణామాలపై వైసిపి ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.మరోవైపు రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సాక్షిగా తనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయించిన దాడి గురించి విపులీకరించడానికి సిద్ధమవుతున్నారు.పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే తనకీవిషయాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ఇప్పటికే స్పీకర్ కి వినతిపత్రం సమర్పించారు.మొత్తం మీద ఈసారి పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ వ్యవహారాల మీదే రచ్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N