NewsOrbit
న్యూస్

Sai daram tej: రికవర్ అయ్యి ఇంటికి వచ్చాక పెళ్లి కండీషన్ పెట్టిన సాయిధరమ్‌తేజ్‌ ఫ్యామిలీ..

Sai daram tej: మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రగాయాల పాలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెల రెండో వారంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ నెల రోజులకు పైగా ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. తాజా నివేదికల ప్రకారం అతను డిశ్చార్జ్ అయ్యాడని.. ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అక్టోబర్ 15న ఇతడు తన 35వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతనికి బంధుమిత్రులు, అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. అల్లు శిరీష్, నిహారిక, శ్రీజా, వరుణ్ తేజ్ తదితరులు అతనికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే అల్లు శిరీష్.. సాయి ధరమ్ బర్త్ డే విషెస్ వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాంతో సాయిధరమ్‌ పెళ్లిపై పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి.

PELLI SANDADI TRAILER: పెళ్ళి సందడి ట్రైలర్ విడుదల …!

సాయిధరమ్ పెళ్లిపై అల్లు శిరీష్ హింట్

“సింగిల్ మ్యాన్ గా ఇదే నీ లాస్ట్ బర్తడే కావాలని నేను ఆశిస్తున్నాను. త్వరలోనే నీవు నీ పెళ్లి న్యూస్ తో మా ముందుకు వస్తావని ఆశిస్తున్నాను” అని అల్లు శిరీష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.


Ring Worm: ఎప్పటి నుంచో వేధిస్తున్న తామర సమస్యకు ఇలా చెక్ పెట్టండి..!!

మెగా ఇంట పెళ్లి బాజాలకు వేళాయే

సాయిధరమ్ తేజ్ పెళ్లి చేయాలని అతని కుటుంబం ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి సాయిధరమ్ కి కచ్చితంగా పెళ్లి చేస్తారనేది సన్నిహిత వర్గాల సమాచారం. ముఖ్యంగా సాయి ధరమ్ తల్లి తన కొడుక్కి త్వరగా పెళ్లి చేయాలని పట్టుబట్టారట. పూర్తి స్థాయిలో రికవర్ కాగానే పెళ్లి చేసుకోవాలనే ఓ కండీషన్ కూడా పెట్టారట. గత నెలలో జరిగిన యాక్సిడెంట్ ఒక చేదు అనుభవంగా మెగా కుటుంబాన్ని బాగా కలిచివేస్తోంది. ఈ దుర్ఘటనను మర్చిపోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేస్తే అంతా సెట్ రైట్ అవుతుందని వారంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుట పడగానే మెగా ఇంట పెళ్లి బాజాలకు సమయం ఆసన్నం అవుతుందని వినికిడి.


Maa Election’s: ప్రకాష్ రాజ్ కి ఊహించని షాక్ ఇచ్చిన “మా” ఎన్నికల అధికారి..!!
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి

మెగాహీరో ప్రస్తుతం ఫిజియోథెరపీ చికిత్స పొందుతున్నాడని.. రోడ్డు ప్రమాదంలో అయిన గాయాల నుంచి కోలుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ఇటీవల ఓ పోస్ట్ లో తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అతడు స్పష్టం చేశాడు. దసరా పండుగ రోజు అతడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయాడని విశ్వసనీయ సమాచారం. అతను రీసెంట్ గా నటించిన రిపబ్లిక్ సినిమా అందరి మన్నలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా రెండు నెలల్లో అతడు తన తదుపరి సినిమాల షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?