NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YCP MP Mopidevi: చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి సంచలన వ్యాఖ్యలు..!!

YCP MP Mopidevi: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఓ తీవ్రమైన వ్యాఖ్యను పురస్కరించుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు మోపిదేవి వెంకట రమణ. వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గత మూడు రోజులుగా వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తున్నారు.

YCP MP Mopidevi serious comments on chandra babu
YCP MP Mopidevi serious comments on chandra babu

 

రాయలసీమలో మూడు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించకుండా ఏరియల్ సర్వే చేసి మిన్న కుండి పోవడాన్ని ఉద్దేశిస్తూ.. ”గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు” అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై మోపిదేవి తీవ్రంగా స్పందిస్తూ..వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందన్నారు. ఏ ఉద్దేశంతో  సీఎం వైఎస్ జగన పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని మోపిదేవి డిమాండ్ చేశారు.

YCP MP Mopidevi: 2009 సెప్టెంబర్ 2న ప్రమాదం

2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అనాడు రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా హెలికాఫ్టర్ ప్రమాదానికి గురవ్వడంతో వైఎస్ఆర్ తో సహా మొత్తం అయిదుగురు మరణించారు. ఆనాడు హెలికాఫ్టర్ ప్రమాదంపై అనేక అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ అభిమానులు రిలయన్స్ పెట్రోల్ బంక్ ‌లపై దాడులు చేశారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు విమాన ప్రమాదంపై అనేక రకాలుగా విచారణ చేసి ఆ ఘటన ప్రమాద వశాత్తు జరిగిందేనని తెల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ఆ ఘటనను పురస్కరించుకుని అనుమానం వ్యక్తం చేస్తూ మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N