Lasya: బుల్లితెర యాంకర్లలో ఒకరైనటువంటి లాస్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమెది ఓ భిన్నమైన శైలి. తనదైన నటనతో ‘సంథింగ్ స్పెషల్’ ప్రోగ్రాంకు యాంకరింగ్ చేయడంలో ఆమెలోని కొత్త కోణం ఆవిష్కరింపబడింది. అయితే ఆ తర్వాత అంటే ముఖ్యంగా పెళ్లి తరువాత అనే చెప్పుకోవాలి. ఆమె క్రమంగా బుల్లితెరకు దూరమైంది. అయితే మరలా ఈ మధ్యనే లాస్య తిరిగి కెమెరా ముందుకొస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె పాల్గొనడం తెలిసినదే కదా. అలాగే వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమంటోంది.
Mahesh-samantha: మంచి ఫామ్ లో వున్న శామ్.. మహేష్ బాబుతో సరసానికి రెడీ!
ఈ సందర్భంలోనే లాస్య తన మనసులోని మాటను చెప్పింది!
ఈ క్రమంలో న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ అయినటువంటి ‘పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు’ షోకి తన భర్తతో సహా లాస్య అటెండ్ అయ్యింది. దానికి సంబందించిన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఇందులో లాస్య కన్నీళ్లు పెట్టుకోవడం చుస్తే మన కళ్ళ వెంబడి నీళ్లు కారుతాయి. విషయంలోకి వెళితే.. ఈ వీడియోలో రష్మీ ఓ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందులో తన ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ తళుక్కుమంది.
Headache: ఈ జ్యూస్ తాగితే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం..!!
అందులో కాన్వర్జేషన్ ఇలా ఉంటుంది!
రష్మీ: నాన్నా.. నేనొక అబ్బాయిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుంటాను. అని అంటుంది. తరువాత రష్మీ తండ్రి: నేను పరువు కోసం బ్రతికే మనిషిని అని నీకు తెలుసు. అలాగే దానికోసం ఏమైనా చేస్తానని కూడా నీకు తెలుసు. అని అంటాడు. దానికి రష్మీ: నాన్న మీరు అర్థం చేసుకుంటారని ఆశించాను. ఐ యామ్ సారీ నాన్న! అని చెబుతూ రష్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఈ సీన్ చూసిన లాస్య కన్నీళ్లు పెట్టుకుంటూ.. “నేను ఇలాగే చేసి వచ్చాను! మా నాన్న గుర్తొచ్చారు!” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య వీడియో వైరల్ అవుతోంది.