NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

AP Elections: ఏపిలో మళ్లీ ఎన్నికల సందడి..! కసిగా టీడీపీ – విశ్వాసంతో వైసీపీ..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసి దాదాపు రెండు నెలలు కావస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగితే రెండు మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. కొండపల్లి, దర్శి తప్ప మిలిగిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీనే కైవశం చేసుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జోష్ లో వైసీపీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే నవంబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీనే ఇచ్చాము, ఓటింగ్ శాతం పెరిగింది అన్న సంతృప్తి టీడీపీలో ఉంది. అయితే టీడీపీ సంతృప్తికి, వైసీపీ జోష్ కు పరీక్ష పెట్టడానికి మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఏ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమే.

AP Elections: ఆ 22 ఇవేనా..!?

2021 పంచాయతీ ఎన్నికల కంటే ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు మరింత టఫ్ గా జరిగాయి. నవంబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. మళ్లీ ఇప్పుడు మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నెల మొదటిలో 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో శ్రీకాకుళం, రాజమండ్రి, మంగళగిరి – తాడేపల్లి కార్పోరేషన్ లు ఉండగా.. పామిడి, శ్రీకాళహస్తి, గూడూరు, నరసరావుపేట, పొన్నూరు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తాడిగడప, పాలకొల్లు, రాజాం, ఆముదాలవలస, గుడివాడ, బాపట్ల, కావలి, కందుకూరు, పొదిలి, భీమవరం, చింతలపూడి, ఆలూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన టీడీపీ రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు స్పష్టంగా పార్టీ శ్రేణులకు చెప్పేశారు. 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయనీ, వీటిలో తెగించి పార్టీ శ్రేణులు పోరాడాలాని పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి టీడీపీ బలం చూపించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అధికార పార్టీ ఎన్ని రకాల దౌర్జన్యాయాలు చేసినా తెగించి నిలబడాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

పాపం టీడీపీ.. స్పీడ్ గా వైసీపీ..!!

ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి కాస్త మెరుగయింది. పోరాడడానికి కార్యకర్తలు, నాయకులు ముందుకొస్తున్నారు. అయితే వైసీపీ వ్యూహాలు ముందు టీడీపీ ఏ మాత్రం నిలువనుంది అనేది తేలాల్సి ఉంది.
* గతంలో జరిగిన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఏ విధంగా ఓడిపోయింది..? అనేది అందరికీ తెలిసిందే. కుప్పంలో టీడీపీ పరాజయం పాలవ్వనుందని “న్యూస్ ఆర్బిట్” ముందుగానే పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. కుప్పంలో అమలు చేసిన స్ట్రాటజీని వైసీపీ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అమలు చేయదు అన్న గ్యారెంటీ ఏమి లేదు. జరగబోయే ఎన్నికల్లోనూ ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ వారి వ్యూహాలతో ముందుకు సాగనుంది. ప్రత్యర్ధి ఎలాంటి వ్యూహాలతో వస్తారని తెలిసి కూడా జాగ్రత్త పడకపోవడం టీడీపీ బలహీనత. ప్రత్యర్ధి ఎత్తుగడలను అడ్డుకోలేకపోవడం టీడీపీ బలహీనతగా మారింది. కుప్పంలో ఎలా జరుగుతుందో తెలిసి తెలిసి టీడీపీ ఓడిపోయింది. పెనుగొండ లాంటి ఏరియాలో బలం ఉన్నప్పటికీ ఓడిపోయారు. ఇలా టీడీపీ చతికిలపడింది. అందుకే చంద్రబాబు రివ్యూలో స్పష్టం చెప్పారు. పార్టీ శ్రేణులు త్యగించండి, కేసులు ఎదుర్కోండి, ఎలాగైనా సరే పార్టీ పరువు, పార్టీ బలం నిరూపించాలని చాలా సీరియస్ గా చెప్పారట. మరో పక్క ప్రతి వారం రెండు మూడు మున్సిపాలటీలకు సంబంధించి రిపోర్టులు తెచ్చుకుని రివ్యూ చేయడంతో పాటు దిశానిర్దేశం చేస్తానని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అటు వైసీపీ కూడా 22 మున్సిపాలిటీలకు 22 కైవశం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మొన్న జరిగిన వాటిలో కొండపల్లి, దర్శిలో ఓడిపోయాము ఈ సారి ఏది ఓడిపోవడానికి వీలులేదని మొత్తం గెలవాలన్న ప్లాన్ లో వైసీపీ ఉంది. జగన్ కూడా అంతర్గతంగా ఈ సారి ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోవడానికి వీల్లేదని.., ఒకవేళ ఓడితే మాత్రం వచ్చే ఎన్నికల్లో సీట్లపై ప్రభావం పడుతుందని పరోక్షంగా హెచ్చరించేసారు..!

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju