NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

C Voter Survey: జగన్ కే జై..! సర్వే ఫలితాలతో విపక్షాల్లో వణుకు..!

c voter survey results jagan cm again

C Voter Survey: ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నా.. ప్రముఖ సర్వే సంస్థ ‘సీ ఓటర్-ఇండియా టుడే’ సంస్థ వెల్లడించిన సర్వే వివరాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధాని కావడం ఖాయమని తేల్చింది. ఏపీలో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి రెండోసారి సీఎం కావడం తథ్యమని చెప్పింది. దేశవ్యాప్తంగా బీజేపీకి, ఏపీలో వైసీపీకి ప్రజాదరణ తగ్గలేదని తేల్చింది. ఎన్డీఏకు 350 నుంచి 296కు సీట్లు తగ్గుతాయని.. బీజేపీ ఎంపీల సంఖ్య 303 నుంచి 271కి పడిపోయినా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చింది.

c voter survey results jagan cm again
c voter survey results jagan cm again

వైసీపీకే పట్టం..

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై (C Voter Survey) సీ ఓటర్ సర్వే విషయాలు ప్రతిపక్షాలకు ఝలక్ ఇచ్చాయనే చెప్పాలి. సీఎం జగన్ పై ప్రజావ్యతిరేకత ఉందనీ.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు.. వైసీపీ పని అయిపోయిందని టీడీపీతోసహా, విపక్షాలన్నీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే విషయాలు షాక్ ఇచ్చేవే. జగన్ కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని.. ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీకే పట్టం కట్టబోతున్నారని చెప్పింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే ఇందుకు కారణమని తేల్చింది. మూడు రాజధానుల అంశం ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాలేదని చెప్పింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కే అవకాశం లేదని తేల్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ మళ్లీ వైసీపీ-టీడీపీ మధ్యనే ఉండబోతోందని చెప్పకనే చెప్పేసింది.

విపక్షాల పరిస్థితి..

సీ ఓటర్ (C Voter Survey) ఇండియా టుడే సర్వే వైసీపీ శ్రేణులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చేదే అని చెప్పాలి. అయితే.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం ఏపీలో ఊహించని విధంగా ప్రభుత్వోద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఖాయమని.. తమకు అనుకూలంగా ఉద్యోగులు మారతారని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 1.29లక్షల సచివాలయ ఉద్యోగాలు, 30 లక్షల ఇళ్లు, కరోనా సమయంలో కూడా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపైనే సీఎం జగన్ నమ్మకంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యా పరిష్కారమైతే.. సీ ఓటర్ – ఇండియా టుడే సర్వే నిజమయ్యే అవకాశాలే ఎక్కువ..!

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?