5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nara Lokesh: టీడీపీకి వాళ్లే పెద్ద మైనస్..!? లోకేష్ టీమ్ పై అనేక ఆరోపణలు..!?

Share

Nara Lokesh: నారా లోకేష్ టీం అసలు ఏం చేస్తోంది..? నారా లోకేష్ కు ఆ టీమ్ అవసరమా..? తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ టీమ్ లాభమా..? నష్టమా..? ఆ టీం మీద వస్తున్న లైంగిక ఆరోపణలపై నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు..? అసలు ఆ లైంగిక ఆరోపణలు నిజమా కాదా..?  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా తెరవెనుక ఉండి ఆ మహిళ చేత ఈ ఆరోపణలు చేయిస్తుందా..? అనే కీలక విషయాలపై అనుమానాలపై స్పందించాల్సిన అవసరం ఉంది. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి నారా లోకేష్ ముందుగా ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత మంత్రి అయ్యారు. షార్ట్ కట్ లో ఆయన రాజకీయాల్లో మంచి పదవుల్లోకి వచ్చారు.

Nara Lokesh team tdp
Nara Lokesh team tdp

Nara Lokesh: టీమ్ ను ఎంచుకోవడంలో కొన్ని తప్పులు

ప్రజల్లో తిరిగి నాయకుడుగా గుర్తింపు తెచ్చుకుని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని, గెలిచిన తరువాత మంత్రి అయి తర్వాత పార్టీ కీలక బాధ్యతలు తీసుకుని ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే ఒక తరహాలో ఉండేది. ఆయన మెచ్యూరిటీ లెవల్స్ బయటకు వచ్చేవి. కానీ ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు షార్ట్ కట్ లోనే ఉన్నారు. ఆయన దురదృష్టం కొద్దీ మంగళగిరిలో మొదటి సారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓడిపోయారు. నారా లోకేష్ కు ఒక రకంగా ఇది పరీక్షా సమయం. అటువంటి వ్యక్తికి ఈ టీమ్ ఏమిటి..? టీమ్ మీద ఆరోపణలు ఏమిటి..? నారా లోకేష్ కు ఉన్న టీమ్ ఆయనకు మైనస్ అని కొందరు అంటుంటారు. లోకేష్ ఓ పెద్ద పార్టీకి, ఓ పెద్ద రాజకీయ నాయకుడికి వారసుడు. అటువంటి వ్యక్తి తన టీమ్ ను సెలక్ట్ చేసుకోవడంలో, ఎంచుకోవడంలో కొన్ని తప్పులు చేశారన్న మాటలు వినబడుతున్నాయి.

భజన చేసే వాళ్లే టీమ్ లో సభ్యులు

తన భజన చేసే వాళ్లే తన టీమ్ లో సభ్యులు. తన లోపాలను చెప్పి సరిదిద్దే వాళ్లు టీమ్ లో లేరు. సలహాలు ఇచ్చే వాళ్లు టీమ్ లో లేరు. మంచి చెప్పే వాళ్లు టీమ్ లో లేరు. “అన్నా మీరు గ్రేట్, అన్నా మీరు తోపు, అన్నా మీరు అక్కడ పోటీ చేస్తే గెలుపు ఈజీ” అనే వాళ్లే ఆయన టీమ్ లో ఎక్కువ సభ్యులు. ఇటీవల కాలంలో లోకేష్ పార్టీలో యాక్టివ్ గా ఉండటాన్ని తగ్గించారు. చంద్రబాబు సూచనల మేరకే ఆయన యాక్టివిటీ తగ్గించారని అనుకుంటున్నారు. ఈ సమయంలో లోకేష్ కు టీమ్ కంటే పార్టీ లో ఆత్మస్థైర్యం దెబ్బతిని పార్టీకి దూరంగా ఉన్న వాళ్లతో నేరుగా లోకేష్ టచ్ లో ఉండాల్సిన సమయం ఇది. పార్టీ అధినేత కుమారుడు అనే కానీ ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవ్వరు ఫోన్ చేసినా వెంటనే స్పందించాలి. మాట్లాడాలి. కానీ అది జరగడం లేదు. లోకేష్ కి ఎమ్మెల్యేలకు అంత చొరవ, చనువు లేదు. కొత్త తరహా రాజకీయ విధానాలు చంద్రబాబు చేయగలరు గానీ లోకేష్ కు ఆ పరిజ్ఞానం లేదని అంటుంటారు.

ఆ రెండు జరిగితే రాజకీయ భవిష్యత్తు

లోకేష్ ఎమ్మెల్యేలు చెప్పింది వినరు. సీనియర్ లు చెప్పిన వినరు. తన టీమ్ ఏది చెబితే అదే నమ్ముతారుట. ఎమ్మెల్యేలు ఏదైనా మెసేజ్ చేసినా రెస్పాన్స్ సరిగా ఉండదట. కొన్ని మెసేజ్ లు టీమ్ వాళ్లే చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ టీమ్ ను మార్చుకోవడంతో పాటు తను మారాల్సిన అవసరం ఉందని పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఈ రెండు జరిగితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అంటున్నారు. షార్ట్ కట్ లో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనకు తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తను కొన్ని పరీక్షలు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆటు పోట్లు ఎదురవుతాయి. కొన్ని విమర్శలు వస్తాయి. కొన్ని లోపాలు ఉంటాయి. కొన్ని సలహాలు తీసుకోవాలి. వీటిన్నింటికి సిద్ధపడాలి.

సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి.

వీటికి సిద్ధపడకుండా వ్యక్తి పూజ చేసే వాళ్లను, భజన పరులను, నిజాలను దాచేవాళ్లను, సబ్జెట్ లేని వాళ్లను టీమ్ గా పెట్టుకుంటే ఇటువంటి ఆరోపణలే వస్తాయి. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఆరోపణలు ఎదుర్కొనే వాళ్లను సస్పెండ్ చేయాలి కదా. ఆయన పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఆ టీమ్ అయినా, పార్టీ పెద్దలైనా స్పందించాలి. ఏమి లేకుండా వదిలివేశారు. అది చిలికి చిలికి గాలివానగా మారి వైసీపీకి ఒక ఆయుధంగా దొరికే అవకాశం ఉంటుంది. లోకేష్ ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ఇంకా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి.


Share

Related posts

ECI: విజయోత్సవ సంబరాలపై ఈసీ ఆదేశాలు బేఖాతరు..! సీఎస్ లకు ఈసీ ఆదేశాలు..!!

somaraju sharma

Bigg boss Ravi Krishna : నవ్యస్వామిని అక్కడ చూసి పడిపోయాడట బిగ్ బాస్ రవికృష్ణ

Varun G

భారత క్రికెట్ హీరో సిరాజ్ హైదరాబాద్ రాగానే ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడికి వెళ్ళాడు…!

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar