NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 24 Today Episode: దీప ఆనంద్ ను రుద్రాణి బారినుండి రక్షిస్తుందా…. దీప,కార్తీక్ లపై అనుమానపడ్డ హోటల్ యజమాని..!!

Karthika Deepam Jan 24 Today Episode: కార్తీక దీపం సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. గత ఎపిసోడ్‌లో సౌందర్య, ఆనందరావులు దీప పెట్టిన కాఫీ గురించి తెలుసుకోవడానికి బొంబాయి హోటల్ కి వెళ్లి ఆరా తీస్తారు. మరోపక్క ఆనంద్ అలియాస్ రంగరాజుని వడ్డీ కట్టలేదనే కారణంతో రుద్రాణి మనుషులు ఎత్తుకునిపోతారు. ఇంకా దీప ఆవేశంగా రుద్రాణికి ఇంటికి వెళ్లి అరవడం,రుద్రాణి ‘వడ్డీ డబ్బులు రూ. 6,400 కట్టి రంగరాజుని తీసుకుని వెళ్లమని చెప్పడంతో దీప బాబు జాగ్రత్త అని చెప్పి వెనుతిరుగుతుంది.

    Singer Sunitha : వైరల్ అవుతోన్న సునీత పాత ఇంటర్వ్యూ.. అందులో ఆమె చెప్పిన ‘ఈ పాయింట్’ వల్లే మళ్ళీ అందరూ చూస్తున్నారు!

    Karthika Deepam Jan 24 Today Episode: డబ్బు కోసం దీప చేసిన ప్రయత్నం ఫలిస్తుందా..?

    ఇక ఈరోజు ఎపిసోడ్ లో దీప ఇంటికి వచ్చి బాబును ఎలా కాపాడుకోవాలో చాలా ఏడుస్తుంది. ఆ రుద్రాణికి ఎలాగయినా ‘డబ్బు ఇవ్వాలి’ అనుకుంటూ ఇంట్లో దాచిన డబ్బంతా వెతికి లెక్క చూడగా మూడువేల చిల్లర వరకూ వస్తుంది. మరి మిగిలిన మూడివేలు ఎలా అని ఆలోచనలో పడిన దీపకు హోటల్ యజమాని గుర్తుకు వచ్చి ఇంటి ఖర్చులకు ఓ వెయ్యి కలుపుకుని మొత్తంగా నాలుగువేలు అడ్వాన్స్‌గా అడగాలి’ అనుకుంటూ హోటల్‌కి వెళ్తుంది. వెళ్లి అడగగానే సరే అని మొత్తానికి 4 వేలు అడ్వాన్స్ ఇస్తాడు.

    PRC: చండశాసనుడు ఎన్టీఆర్ కే చెమటలు పట్టించిన ప్రభుత్వ ఉద్యోగులు!జగన్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇదే!!
    ఎప్పటిలాగానే ఆవేశంగా రుద్రాణి ఇంటికి వెళ్లిన కార్తీక్:

    ఇంతలో కార్తీక్ ఇంటి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే పక్కింటి మహాలక్ష్మి వచ్చి ఆ రుద్రాణి బాబుని ఎత్తుకునిపోయింది అని చెప్పడంతో ఆవేశంగా కార్తీక్ రుద్రాణి ఇంటికి వెళ్తాడు. రుద్రాణీ అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆవేశంగా అరుస్తాడు కార్తీక్. ‘సారు రావడం రావడమే ఆ అరుపులు ఏంది సారు. మీరు తీసుకున్న అప్పుకు గాని వడ్డీ ఇప్పటిదాకా కట్టలేదు.అందుకే రంగరాజుని తీసుకొచ్చాను అంటుంది. ఇప్పటికి వడ్డి 6 వేల నాలుగు వందలు చెల్లించి రంగరాజుని విడిపించుకోగలరు సారు అంటుంది.ఇప్పుడే దీపమ్మ వచ్చింది.. తిట్టింది.. వెళ్లింది.. నువ్వు తిట్టడానికి వచ్చావ్.. తిడతావ్ వెళ్తావ్.మీరే ఏది అన్నా నాకు డబ్బులు కావాలి సారు.. వెళ్లండి వెళ్లి తీసుకుని రండీ’ అంటుంది. దాంతో కార్తీక్ కూడా మౌనంగా వెనుతిరుగుతాడు. ఈ సీన్ కాస్త రొటీన్ గా అనిపిస్తుంది చూసే ప్రేక్షకులకు..ఎంతో ఆవేశంగా వస్తున్నారో అంతే అవమానంతో వెళ్లడం ప్రతి సారి మాములు అయిపొయింది అనిపిస్తుంది.

    కార్తీక్, దీపలపై అనుమాన పడిన హోటల్ యజమాని :

    ఇంకా కార్తీక్ హోటల్‌కి వెళ్లి ఆ బొంబాయ్ భద్రాన్ని 6 వేలు అడ్వాన్స్ అడుగుతాడు.దానికి యజమాని ‘ఏంటయ్యా నువ్వు? ఆ వంట మనిషి ఇద్దరూ కూడబలుక్కుని మరి నన్ను అడ్వాన్స్ అడుగుతున్నారా? ఏంటి?ఇందాకే వంట మనిషి వచ్చి 4 వేలు అడ్వాన్స్ తీసుకుని వెళ్లింది అంటాడు.సరేలే నిన్ను చూస్తే మంచివాడిలా ఉంటావ్ కాదనలేను’ అంటూ 6 వేలు అడ్వాన్స్ ఇస్తాడు.ఇంతలో దీప 6 వేలు వడ్డీ డబ్బులు రుద్రాణికి ఇచ్చి బాబుని ఎత్తుకుని బయలుదేరుతుంది. అప్పుడే రుద్రాణి.. ‘అమ్మా దీపమ్మా ఆగు..ఏదో కింద మీద పడి ఈ వడ్డీ డబ్బులు అయితే తెచ్చి ఇచ్చావు సరే.. కానీ రేపటి నెలతో మీకు ఇచ్చిన గడవు తీరిపోతుంది. అప్పుడు మీరు పది రూపాయల వడ్డీ ఇస్తామన్నా నేను తీసుకోను.. మూడులక్షల 20 వేల భాకీ మొత్తాన్ని ఇస్తేనే నేను తీసుకుంటాను.. లేకుంటే రంగరాజుని తీసుకుని ,ఆ ఇంటిని జప్తు చేసుకుంటాను.

    పిల్లల్లో ఒకర్ని తీసుకుపోతా అన్నా రుద్రాణి అంత పని చేస్తుందా..??

    నా మనసులో ఇంకేమైనా ఆలోచన వస్తే మీ ఇద్దరి పిల్లల్లో ఒకరిని అనే లోపే మన దీపక్క ఆ మాట పూర్తి కానివ్వకముందే ‘రుద్రాణీ..’ అని గట్టిగా అరుస్తుంది.ముందు ‘అప్పు తీర్చండి దీపమ్మా అంటుంది.రుద్రాణి మంచిది కాదు మంచిది కాదు అని అందరూ ఎందుకు అనుకుంటారో.. మీ గడువు తీరాక తెలుస్తుందిలే వెళ్లు’ అంటుంది. ఇక దీప బాబుని తీసుకుని ఇంటికి రాగనే హిమ, సౌర్యలు ఎదురొచ్చి వాడ్ని తీసుకుని ఆడుకోవడానికి వెళ్లిపోతారు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి చూశావా ఆ రుద్రాణి ఎంత పని చేసిందో అంటుంది. ఆ రుద్రాణి మనిషి కాదు డబ్బు పిచ్చితో ఎంత పని అయినా చేస్తుంది. మనుషుల బంధాలకు విలువనివ్వదు’ అంటూ తిడుతుంది. దీప కూడా ఆవేశంగా రుద్రాణి గురించి మహాలక్ష్మి దగ్గర తిట్టిపొస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో పూర్తయింది.!మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..!

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju