Ram Charan-Gowtam Tinnanuri Film: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత మూడేళ్ల నుంచీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆర్ఆర్ఆర్` సినిమాపైనే దృష్టి సారించారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకోగా.. అనేక వాయిదాల అనంతరం మార్చి 25న గ్రాండ్‌గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఆర్ఆర్ఆర్ షూట్ ఫినిష్ అయిన వెంటనే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రారంభించాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్.. `జెర్సీ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరితో తన 16వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
అయితే తాజాగా ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కబోతోందట. ఇందులో రామ్ చరణ్ భవిష్యత్తులోకి ట్రావెల్ చేస్తాడని.. ఆ తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే ఫ్యూచర్ కాన్షెప్ట్తో గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!