NewsOrbit
న్యూస్

Guppedantha Manasu : అమ్మో దేవయాని మామూలుది కాదుగా… రిషిని తన గుప్పెట్లో పెట్టుకుని జగతిని అవమనించడానికి మరొక ప్లాన్.!

Guppedantha Manasu

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.గత ఎపిసోడ్‌లో అందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ హ్యాపీగా గడుపుతారు. గాలిపటాలు ఎగురవేయడం,పిండివంటలు గురించి అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మహేంద్రని పాటపాడమని వసు అడగడంతో అక్కడికి రిషి రావడం చూసి రిషితో పాడించండి చూద్దాం’ అని పాటపాడకుండా తప్పించుకుంటాడు.. ఇక ఇంతలో రిషి రావడం రావడమే ‘పెద్దమ్మ ఎక్కడా?’ అంటాడు. ‘రూమ్‌లో ఉంది’ అని చెప్పడంతో మీరంతా ఇక్కడ ఉంటే పెద్దమ్మ ఒంటరిగా గదిలో ఉండటం ఏంటీ’ అంటూ ఆలోచిస్తూ పెద్దమ్మా దగ్గరకి వెళ్లి ఏం అయ్యింది పెద్దమ్మా అంటాడు రిషి.

Guppedantha Manasu : వామ్మో దేవయాని మామూలుది కాదుగా..?

Guppedantha Manasu

‘నాన్నా రిషి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.. నువ్వు బాగుండటమే ఈ పెద్దమ్మకి ఆనందం.. ప్రపంచంలో నాకు ఏది ముఖ్యం కాదు రిషి..’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంది. ‘పెద్దమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్తం కావట్లేదు’ అంటాడు రిషి. ఇంతలో మహేంద్ర అటుగా వెళ్తూ ఆ మాటలు విని ఆగిపోతాడు. ‘నాన్నా రిషి నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను..’అంటుంది దేవయాని. ‘పెద్దమ్మా.. మీరు వెళ్లిపోవడం ఏంటీ’ అంటాడు రిషి కంగారుగా.. ‘అవును నేను నా కొడుకు దగ్గరకు వెళ్లిపోతున్నాను రిషి’అంటుంది దేవయాని. రిషితో పాటు బయట వాళ్ళ మాటలు వింటున్న మహేంద్ర కూడా షాక్ అయిపోతాడు. ‘మీ కొడుకు ఏంటి పెద్దమ్మా నేను మీ కొడుకునే కదా’ అంటాడు రిషి ఇన్నాళ్లు నేను అదే అనుకున్నాను రిషీ.నీకు. చిన్నపటి నుండి మంచేదో చెడేదో చెప్పి పెద్ద చేశాను.. కానీ నీకు తెలియకుండా నువ్వు ఒక వలలో ఇరుక్కున్నావ్ ‘ఏం జరిగింది పెద్దమ్మా అంటే నా పెంపకం మీద అనుమానం వస్తోంది.. ప్రతీది నన్ను అడిగి చేసేవాడివి.కానీ ఈ రోజు ఈ పెద్దమ్మ మీద ప్రేమ లేదేమో అనిపిస్తోంది రిషీ.

Guppedantha Manasu : ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్న దేవయాని :

Guppedantha Manasu
ఈ ఇంట్లో ఎటు తిరిగినా నా ఇల్లు అనే భావన ఉండేది.కానీ పరాయి వ్యక్తులు వచ్చి ఇంట్లో తిరుగుతుంటే ఇది నా ఇల్లు కాదేమో నువ్వు నా కొడుకు కాదేమో’ అంటూ దేవయాని ఏడుస్తుంటే.. రిషి వెంటనే ఆ మాట అనకండి పెద్దమ్మా నేను భరించలేను.మీకు నచ్చని పనులు నేను ఎప్పుడూ చెయ్యలేదు కానీ డాడ్ ఆరోగ్యం గురించి అంటూ సద్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు రిషి ఏడుస్తూ..అంతా చూస్తున్న మహేంద్ర షాక్ అయిపోతాడు దేవయాని నటనకు.. ‘రిషి నేను నిన్ను తప్పు బట్టడం లేదు నాన్నా.. నీ నిర్ణయాలు నీవి.నచ్చని వ్యక్తులు వచ్చాక ఈ ఇంట్లో నా విలువ ఏంటో నాకు అర్థమైంది.. అందుకే నేను వెళ్తాను.ఒకవేళ నేను చచ్చిపోయానని తెలిస్తే వీలైతే ఒక్కసారి వచ్చి చూడు’ అంటూ నాటకాన్ని రక్తి కట్టిస్తుంది దేవయాని. దాంతో రిషి మరింత బాధపడుతూ ‘పెద్దమ్మా మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది.. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు పెద్దమ్మా..మీరే నాకు అమ్మ మీరే నాకు పెద్దమ్మ.. మీరే నాకు దైవం’ అంటాడు రిషి ఏడుస్తూ.. దాంతో దేవయాని కన్నీళ్లు తుడుచుకుని విలన్‌లా నవ్వుతుంది.

దేవయాని ప్లాన్ ను తిప్పిగొట్టిన మహేంద్ర :

Guppedantha Manasu

అంతా చూసిన మహేంద్ర తన రూమ్‌లోకి వచ్చి జరిగిందంతా తలుచుకుంటూ వదిన కచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది. జగతిని మళ్లీ వదిన అవమానించబోతుంది.ఏదొకటి చెయ్యాలి’ అని అనుకుంటాడు.ఇంతలో జగతి రావడంతో.. ‘జగతి నువ్వు ఒక పని చెయ్యాలి’ అంటాడు.రిషీ దేవయాని మాటల్ని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మహేంద్ర ఓ లగేజ్ బ్యాగ్ తీసుకుని జగతిని వెంటబెట్టుకుని కిందకు దిగుతాడు. రిషి షాక్ అయ్యి పైకి లేస్తాడు. మహేంద్ర,జగతిలు రిషికి దగ్గరగా వెళ్లి జగతి వెళ్లిపోతుంది’ అంటాడు మహేంద్ర. మేడంను ‘వెళ్లమని ఎవరూ చెప్పలేదు కదా డాడ్’ అంటాడు రిషిఇంతలో వసు, ధరణిలు లగేజ్ చూసి షాక్ అవుతారు.

దేవయానికి షాక్ ఇచ్చిన జగతి,మహేంద్రలు :

Guppedantha Manasu
ఇంతలో దేవయాని,ఫణేంద్రలు వస్తారు. లగేజ్ బ్యాగ్ చూసి దేవయాని ఏంటి ‘ఈ జగతి ఇంత ట్విస్ట్ ఇచ్చింది నేను పంపాలనుకుంటే తనే వెళ్లిపోతుంది.. మహేంద్ర జగతిలు మామూలు వాళ్లు కాదుగా అనుకుంటుంది.అమ్మో నేను రిషి దగ్గర చెడ్డ దాన్ని కాకూడదు’ అనుకుని ‘ఏంటి జగతి.. ఎందుకు ఇలా సడన్‌గా బయలుదేరుతున్నావో అంటుంది.ఫణేంద్ర కూడా ఏంటి జగతి వెళ్లిపోవడం అంటాడు. మనం రమ్మనలేదు.అలాగే మనం ఉండమనలేం అన్నయ్యా’ అంటాడు మహేంద్ర. ఫణేంద్ర మాత్రం అమ్మా జగతి నువ్వు ఇంట్లోకి రావడం మాకు ఎప్పుడూ ఆనందమే అమ్మా’ అంటాడు ఫణేంద్ర బాధగా.ఈ ఇంటికి జగతి రావడానికి కారణాలు ఏవైనా సరే వచ్చినందుకు తనని వచ్చేలా చేసిన వాళ్లకి థాంక్స్ చెప్పాలి’ అంటాడు మహేంద్ర. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju