NewsOrbit
న్యూస్

UP Election 2022: యుపిలో ప్రారంభమైన తొలి దశ పోలింగ్..

UP Election 2022:  ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది. యూపిలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి విడతలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.  పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల నుండి 623 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లోని తొమ్మిది మంది మంత్రులు తమ అదృష్టాన్ని మరో సారి పరీక్షించుకోనున్నారు. కేబినెట్ మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేష్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్,  అతుల్ గర్గ్, ఛౌధురి లక్ష్మీనారాయణ్ తో పాటు మరో ముగ్గురు మంత్రులు తొలి దశ పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 

UP Election 2022:  తొలి  దశలో ఈ వర్గమే కీలకం

తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం ఏడు దశల్లో యూపి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని 11 జిల్లాల్లో జాట్ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్నాయి. ఈ 58 నియోజకవర్గాల్లో జాట్ సామాజికవర్గ ఓటర్లు అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 53 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఎస్పీ, బీఎస్పీ రెండు రెండు స్థానాలు, ఆర్ఎల్డీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఈ దఫా ఆర్ఎల్డీ, ఎస్పీ పొత్తుతో రాజకీయ ముఖ చిత్రంపూర్తిగా మారింది.

Related posts

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N